Andhra-Telangana fight over data theft case intensifies అమోజాన్ సర్వర్ లో ఏపీ ప్రజల డేటా..!

Ap data theft cyberabad police seek information from amazon web services

TDP, data theft, fir registered, madhapur police station, Cyberabad CP, Sajjanar, Nara Lokesh IT Minister, Sevamitra, Andhrapradesh, crime

The police say the probe has revealed that IT Grids India Pvt. Ltd. has got illegal access to various personal and sensitive data of individuals. Cyberabad police commissioner says the database is said to have been stored with Amazon Web Services

డేటా చౌర్యం కేసు దర్యాప్తులో ఎంతటివారున్నా వదలం: సజ్జనార్

Posted: 03/04/2019 07:50 PM IST
Ap data theft cyberabad police seek information from amazon web services

ఎన్నికల వేళ...ఆంధ్రప్రదేశ్ ఓటర్ల వ్యక్తిగత విషయాలు బట్టబయలు కావడం కలకలం రేపుతోంది. ఐటీ గ్రిడ్ కంపెనీ కేసులో సైబరాబాద్ పోలీసులు జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్నాయి. సేవా మిత్రలో ఉన్న సమాచారం మొత్తం అమెజాన్‌ సర్వర్‌లో నిక్షిప్తం కావడం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎవరున్నా, ఎంతటివారైనా వదిలేది లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.

ఇవాళ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏపీ ఓటర్ల వివరాలు టీడీపీ యాప్ సేవా మిత్రకు ఎలా వస్తాయి ? ప్రభుత్వ డేటాలోని అన్ని వివరాలు సేవా మిత్ర యాప్‌లో ఉన్నాయని పేర్కొన్న సీపీ అసలు సెన్సిటివ్ డేటా ప్రైవేటు సంస్థకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సేవా మిత్ర సమాచారం అంతా అమెజాన్ సర్వర్ లో నిక్షిప్తం చేశారని.. ఇలా ఎందుకు చేశారన్న వివరాలు తమ దర్యాప్తులో వెల్లడవుతాయని ఆయన తెలిపారు.

డేటాను దుర్వినియోగం చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని అనుకున్నారనే అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ కమీషనర్. లబ్ధిదారుల డేటా ఎలా తెచ్చారో దర్యాప్తులో తేలుతుందని, విచారణలో కీలకమైన ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. ఎన్నాళ్ల నుంచి డేటా వారి దగ్గరుందో దర్యాప్తులో తేలుతుందన్నారు. అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని ఏపీలో 50 కేసుల వరకు నమోదయ్యాయని.. డేటాతో ఎవరినైనా వ్యక్తిగతంగా బ్లాక్‌ మెయిల్‌ చేయొచ్చని సీపీ చెప్పారు.

ఐటీగ్రిడ్ సంస్థ కేసులో ఏపీ పోలీసులు పరిధి దాటి ప్రవర్తించారని సీపీ సజ్జనార్ అన్నారు. ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్నామనేది అవాస్తవమని.. సాక్షులుగా పిలిపించి విచారించామని వెల్లడించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని తెలిపారు. అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ఇలా చేశారని ఆరోపించారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టారు. నిందితులను తాము విచారిస్తున్నట్లు చెప్పిన తర్వాత కూడా హెబియస్ కార్పస్‌ను ఆశ్రయించడం సరికాదన్నారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన సూచనలిచ్చిందని తెలిపారు.

ఐటీగ్రిడ్ సంస్థలో ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో అమెజాన్ సంస్థకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. కేసులో అశోక్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించామని తెలిపిన సజ్జనార్.. అతడు సరెండర్ కావాలని కోరుతున్నట్లు పత్రికాముఖంగా చెప్పారు. ఐటీగ్రిడ్ సంస్థకు అశోక్ సీఈవోగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఏపీలోనే ఉన్నాడని పోలీసుల అనుమానం.

లోకేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదుతో ఐటీగ్రిడ్‌లో సోదాలు చేశామని సజ్జనార్ తెలిపారు. కేసు తమ పరిధిలో ఉంటే ఏపీ పోలీసులు ఇష్టారీతిలో కల్పించుకుంటున్నారని సీపీ సజ్జనార్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులపై కూకట్‌పల్లిలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఐటీగ్రిడ్ సంస్థపై మాదాపూర్ పీఎస్‌లో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రేగొండ భాస్కర్, విక్రంగౌడ్, ఫణికుమార్, చంద్రశేఖర్‌ను విచారించినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyberabad CP  Sajjanar  TDP  data theft  Sevamitra  Andhrapradesh  crime  

Other Articles