Woman stages protest against 'illegal sale' in Tasmac shop మద్యం కొంటే దాడి చేస్తానని మహిళ హెచ్చరిక

If you enter inside the bar i will stab myself knife in hand woman protests against tirupur tasmac shop

woman hulchul wine shop, woman hulchul in tamil nadu, woman hulchul in pandian nagar, woman hulchul in tirupur, woman wine shop, woman protest against tasmac, tasmac shop tirupur, tasmac news, tasmac bar tirupur, protest against tasmac, tirupur, tamil nadu

A woman was seen sitting in front of a TASMAC shop being run in the Pandian Nagar area, protesting against the shop doing brisk business right from the early hours of the morning.

కాళీగా మారిన కవిత.. మద్యం కొంటే దాడి చేస్తానని హెచ్చరిక

Posted: 03/01/2019 12:37 PM IST
If you enter inside the bar i will stab myself knife in hand woman protests against tirupur tasmac shop

తమిళనాడు తిరువూరులో ఓ మహిళ మహంకాళిగా మారింది. ఏకంగా మధ్యం షావు ముందుకు వచ్చి.. అక్కడికి వచ్చే మందుబాబులను బెంబేలెత్తించింది. ఇల్లు గడిపే మార్గాన్ని పట్టించుకోకుండా నిత్యమూ మద్యం తాగుతున్న భర్తను చూసిన ఆమె, వినూత్న రీతిలో నిరసన తెలిపింది. మద్యం కొనగోలు చేస్తే కత్తులతో దాడి చేస్తానని మందుబాబులను హెచ్చరించింది. అంతేకాదు దుకాణం ముందు రెండు కత్తులతో వచ్చి ఎవరైనా మద్యం కొనుగోలు చేస్తే ఊరుకునేది లేదని బెదిరించిన ఈ మహిళ.. తనను దాటి ఎవరైనా  మధ్యం కొనుగోలు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ అక్కడే కూర్చుంది.

అమెను దాటుకుని మధ్యం కొనుగోలు చేసేందుకు మందుబాబులు కూడా జంకారంటే అమె ఆగ్రహరూపం ఎంతలా వుందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, తిరుపూరులో ఈ ఘటన జరిగింది. స్థానికంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న టాస్మాక్ దుకాణం ముందుకు వచ్చి అక్కడే కూర్చుంది. ఇల్లు గడిపే మార్గాన్ని పట్టించుకోకుండా నిత్యమూ మద్యం తాగుతున్న తన భర్త ప్రవర్తనను, తీరును చూసిన అమె వినూత్న రీతిలో నిరసన తెలిపింది.  తన భర్తతో పాటు మందుబాబుల ఇళ్లలో పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని అమె చెప్పింది.

ఒక్కసారిగా మహిళ అలా చేయడంతో అక్కడికి వచ్చిన మందుబాబులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే దుకాణ నిర్వాహకులు పారిపోయారు. అనంతరం, కవితను స్టేషన్‌కి తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా అనేక టాస్మాక్‌ దుకాణాలు వెలిసి, సమయపాలన లేకుండా విక్రయాలు సాగిస్తున్నాయని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles