mercury raises high this summer, MET warns Telanganites ఈ సమ్మర్ చాలా హాట్ గురూ.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.!

Met warns telanganites mercury raises very high this summer

hot summer in telangana, hot summet in Andhra pradesh, sun intensity increases in telangana, hotty summer, summer precautions, Sun Intensity, Telangana, States, Increased, Sun Pictures, Weather Report, Telangana News, AP News, latest news

indian meteorological department warsn telugu states people mainly telanganites to take precautions this summer, as the mercury increases very high this summer and experiances very hot summer

ఈ సమ్మర్ చాలా హాట్ గురూ.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.!

Posted: 03/01/2019 11:49 AM IST
Met warns telanganites mercury raises very high this summer

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరూ ఎండలలో ప్రయాణాలు చేయకూడదని అదేశాలు జారీ చేసింది. కాటన్ వస్త్రాలు ధరించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకునే ప్రజలకు తమ వ్యవహారాలను పూర్తి చేసుకోవాలని సూచించింది. ఫిబ్రవరిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడమే అందుకు నిదర్శనమని వాతావరణ శాఖ పేర్కొంటోంది.

2016లో వేసవి కాలంలో ఎలాంటి వడగాలులు వీచాయో.. అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2018లో కేవలం 7 రోజులు మాత్రమే వడగాలులు వీచాయని, ఈ ఏడాది మాత్రం అధికంగా వడగాలులు వీస్తాయని తెలిపింది. ఫిబ్రవరి మాసంలో మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకు కారణం గాలిలో తేమ తగ్గడమేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ వేసవి కాలంలో రాష్ట్రంలో చాలాచోట్ల 46 నుండి 47 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డయ్యే సూచనలున్నాయని విశ్లేషించారు.

మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు విపరీతంగా వుండటంతో పాటు వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని పేర్కోన్నారు. అయితే ఏప్రిల్, మే నెలలో వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తప్పనిసరి పనులు వున్నవారు తప్ప ప్రజలు ఎండల్లోకి రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sun Intensity  Telangana  States  Increased  Sun Pictures  Weather Report  Telangana News  AP News  latest news  

Other Articles