Let's give peace a chance: Pak PM శాంతికి మరో అవకాశం ఇద్దాం: పాక్ ప్రధాని

Imran khan offers talks again with india says better sense should prevail

Imran Khan, pakistan pm, IAF pilot, Pakistan. Indian pilot, Pakistan Air Force, Pakistan, INDIA, Pak-IND border situation, IAF Air Strikes in Pakistan, Pakistan Air Force's F-16 shot down, Indian Air Force, Pakistan's F-16 jet, Imran Khan, Pak PK Imran Khan Nuclear tops meet, Mohammad Faisal, Pakistan's MoFA spokesperson, PAF undertook strikes across LoC, Pakistani airspace. Pakistan, INDIA, Pak-IND border situation

Pakistan Prime Minister Imran Khan again offered talks with India and said better sense should prevail between both the countries. He claimed that two Indian MIGs crossed the Line of Control and they were shot down.

చర్చలతోనే పరిష్కారం.. శాంతికి మరో అవకాశం ఇద్దామంటున్న పాక్

Posted: 02/27/2019 05:54 PM IST
Imran khan offers talks again with india says better sense should prevail

పాకిస్థాన్ ప్రధాని మరోసారి శాంతి చర్చలకు పిలుపునిచ్చారు పాకిస్థాన్ ప్రధాని. ఉద్రిక్తతలు హెచ్చుమీరితే పరిస్థతులు తీవ్రంగా ఉంటయాన్నారు. అందుకే భారత్, పాక్ కలిసి కూర్చొని మాట్లాడుకుందామని చర్చలకు ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య యుద్ధం అంటూ మొదలైతే అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు.. ఎవరి చేతుల్లోనూ వుండదని.. అందుకని రెండుదేశాలు కలిసి కూర్చుని మాట్లాడుకుందామని ఇమ్రాన్ ఖాన్ పిలుపు నిచ్చారు.

ఉగ్రవాదం అంతానికి ఏం చేయాలో చెప్పండంటూ మోదీని ప్రశ్నించారు. తాము భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాల్ని కూల్చేశామన్నారు. కలిసి కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరిద్దామన్నారు. ఇద్దరు భారత ఫైలట్లు వారి అదుపులో ఉన్నారన్నారు. ఆలస్యం చేస్తే మోదీతో పాటు తనపరిధి నుంచి కూడా పరిస్థితి చేయి దాటిపోతుందన్నారు. మా వద్ద కూడా బలమైన ఆయుధాలు ఉన్నాయన్నారు. కానీ యుద్ధం వైపు కాకుండా శాంతిగా సమస్యను పరిష్కరిద్దామని భారత్ కు సూచించారు.

ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని ఆకాంక్షించిన ఇమ్రాన్ ఖాన్.. పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుసార్లు విజ్ఞప్తి చేశామని అన్నారు. భారత సైన్యం తమ భూభాగంలోకి వచ్చిందని, అందుకే, తాము భారత భూభాగంలోకి రావాల్సి వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ సమర్థించుకున్నారు. పుల్వామా ఘటన, ఇతర అంశాలపై భారత్ తో చర్చించేందుకు సిద్ధమని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.

కాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తమ అదుపులో ఇద్దరు భారత వాయుసేన పైలెట్లు వున్నారన్న వార్తల నేపథ్యంలో విదేశాంగ అధికార ప్రతినిధ రవీష్ కుమార్ కొంత సేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో కేవలం ఒక్క ఇండియన్ పైలెట్ మాత్రమే పాక్ అధుపులో వున్నారని వివరించారు. అతను కూడా కేరళకు చెందిన విక్రమ్ అభినందన్ అని చెప్పారు. కాగా, పాక్ ఫ్రధాని ఇద్దరు పైలెట్లు అని చెబుతున్న క్రమంలో ఇంతకీ పాక్ అదుపులో వున్నది ఒక్కరా.. లేక ఇద్దరా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles