Indian pilot missing is in Pakistan custody దారి తప్పిన భారత్ మిగ్.. పాక్ అదుపులో ఫైలెట్

Iaf air strike indian pilot is missing says foreign ministry spokesman

Pallam Raju, mayanmar terror based camps, IAF Air Strikes in Pakistan, Pakistan Air Force's F-16 shot down, Indian Air Force, Pakistan's F-16 jet, Imran Khan, Pak PK Imran Khan Nuclear tops meet, Mohammad Faisal, Pakistan's MoFA spokesperson, PAF undertook strikes across LoC, Pakistani airspace. Pakistan, INDIA, Pak-IND border situation

An Indian pilot is "missing in action" after an Indian Air Force aircraft shot down a Pakistani jet that was targeting installations in India, the government said after Pakistan claimed "strikes across Line of Control from within Pakistani airspace",

దారి తప్పిన భారత్ మిగ్.. పాక్ అదుపులో ఫైలెట్

Posted: 02/27/2019 04:05 PM IST
Iaf air strike indian pilot is missing says foreign ministry spokesman

భారత ఫైలట్ తాము అదుపులోకి తీసుకున్నామని చెప్పిన పాకిస్థాన్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తొలుత భావించినా.. ఆ తరువాత మాత్రం అందులో వాస్తవముందని గ్రహించాయి. భారత ఫైలెట్ ను అదుపులోకి తీసుకున్నామని చెబుతూ. ఇందుకు సంబంధించిన పాత వీడియోలను వదిలడంతో అది పాత వీడియోలు, ఫేక్ వీడియోలని ముందుకు దేశంలోని నెట్ జనులు తేల్చేశారు. ఆ తరువాత పాక్ యుద్ద విమానాలను తరమికొట్టే క్రమంలో భారత వాయుసేనకు చెందిన మిగ్ తప్పిపోయినట్లుగా వస్తున్న వార్తలే  నిజమయ్యాయి.

ఈ మేరకు భారత విదేశాంగ అధికారులు అంగీకరించారు. భారత పైలెట్ ను అదుపులోకి తీసుకున్న తాజా చిత్రాలు, వీడియోలను పాకిస్థాన్ ఆన్ లైన్ లో కూడా పెట్టింది. దీంతో తాజాగా దీనిపై మీడియా సమావేశం పెట్టిన విదేశాంగ అధికార ప్రతినిధ రవీష్ కుమార్.. భారత వాయుసేనకు చెందిన ఓ ఫైలట్ తప్పిపోయినట్లు నిర్ధారించారు. పాకిస్థన్ ఇప్పటికే ఒక ఇండియన్ ఫైలట్ తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించారు. ఆ వార్తలు నిజమేనని భారత అధికారులు నిర్ధారించారు.

మంగళవారం తెల్లవారుజామన భారత వైమానిక దాడులు అనంతరం పాకిస్థాన్ ఇవాళ ఉదయం భారత్‌పై దాడులకు ప్రయత్నించిందన్నారు. అయితే భారత సైన్యం పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ఇరుదేశాల పరస్పర దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన f-16 ఫైటర్ జెట్‌‌ను నేలమట్టం చేశామన్నారు. అయితే ఈ దాడుల్లో మిగ్-21 విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో మిగ్ -21 భారత పైలట్ తప్పిపోయారని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ నిర్ధారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles