Pakistani girls condemn terror strike in Pulwama పూల్వామా దాడిని ఖండిచిన ఫాక్ జర్నలిస్ట్..

I am a pakistani and i condemn pulwama terror attack pak journo

Pulwama Terror Attack, Sehyr Mirza, Anti Hate Challenge, No to War, message of love, Pakistan journalist, Peace activist, Jaish e Mohammed, Pulwama attack, pakistan

A humble initiative by a Pakistani journalist is going viral on social media for all the right reasons. "I am a Pakistani and I condemn Pulwama terrorist attack," reads a placard held by Sehyr Mirza, who has launched the '#AntiHateChallenge' on social media.

పూల్వామా దాడిని ఖండిచిన ఫాక్ జర్నలిస్ట్.. అక్కడి యువతులు..

Posted: 02/21/2019 12:32 PM IST
I am a pakistani and i condemn pulwama terror attack pak journo

పుల్వామా ఉగ్రదాడి ఆమెనూ కదిలించింది.. కన్నీరు పెట్టించింది! ఆమె భారతీయురాలు అయితే అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కానీ ఆమె పాకిస్థానీ. భారత్‌పై వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్న గడ్డపై పుట్టి పెరిగిన అమ్మాయి. పేరు సెహీర్‌ మీర్జా. వృత్తి జర్నలిస్టు. అంతేకాదు ప్రపంచశాంతి కార్యకర్త. పెద్ద సంఖ్యలో సైనికులను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె బాహాటంగానే చెబుతోంది. అంతేనా.. భారత్‌కు మద్దతుగా 'యాంటీ హేట్‌ చాలెంజ్‌'ను చేపట్టింది.

అమెకు మద్దతుగా మరికొందరు పాకిస్తాన్ యువతులు కూడా పూల్వామా దాడిని ఖండిస్తున్నామని ప్లకార్డులను ప్రదర్శించారు. అయితే వీరందరూ కూడా పాకిస్తాన్ కు చెందిన యువతులే కావడం గమనార్హం. బాలికల హక్కుల కోసం ఉగ్రవాదులతో పోరాడిన మాలాల యూసుఫ్ జాయ్ తరహలోనే అక్కడి యువతులు తమలోని మానవత్వాన్ని చాటుకునేందుకు ఉగ్రవాదాన్ని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టు, పీస్ యాక్టివిస్టు సెహీరా మిర్జా.. తాను పోస్టు చేసిన ఫోటోలో.. ఒక ప్లకార్డును పట్టుకుంది.

దానిపై తాను పాకిస్థానీ అమ్మాయినని, అయినా పుల్వామా దాడిని ఖండిస్తున్నానని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో యాంటీ హేట్ ఛాలెంజ్ తో పాటు నో టు వార్ అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా ప్లకార్డుపై రాసింది. ఈ ఫోటోను పోస్టు చేసిన తన ఫేస్ బుక్ అకౌంటులో 'దేశభక్తి కోసం మానవత్వాన్ని కుదువ పెట్టలేం' అంటూ తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకుంది. దాని కింద.. 'నేను పాక్‌ అమ్మాయిని. అంతటితో ఆగకుండా.. భారత్ కవి సాహిర్ లుదిన్యావి రాసిన కవితలోని కొన్ని పంక్తులను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

‘‘రక్తం వాళ్లదా..? వీళ్లదా అన్నది కాదు.. మనుషులదే కదా అన్నది కోణం... యుద్దం తూర్పున జరిగినా.. పశ్చిమాన జరిగినా.. ప్రపంచ శాంతి హత్యగా జరిగుతుందా.?, ఇళ్ల మధ్య బాంబులు పేలుతున్నాయా.? లేక సరిహద్దుల్లో బెంబేలెత్తిస్తున్నాయా.? అన్నది కాదు.. ఆత్మాలయాలు క్షతగాత్రం అయ్యిదా.? అన్నదే కోణం.. యుద్దం స్వతహాగానే ఓ సమస్య, అదెలా సమస్యలను పరిష్కరిస్తుంది..?  ఇవాళ బాంబుల విస్పోటనాలు.. రుధిరధారలు.. రేపు అకలి కేకలు, ఆర్తనాథాలు.. కరువు విలయం.. అన్న పంక్తులను కోట్ చేసింది’’.  

అంతటితో అగని సెహీరా మిర్జా.. తన యాంటీ హేట్ ఛాలెంజ్ తో పాటు నో టు వార్ కు మద్దతుగా చేపట్టిన ప్రచారంలో భాగస్థులు కావాలని అందరినీ కోరుతోంది. ఆమె స్ఫూర్తితో పాకిస్తాన్ లో చాలామంది మన దేశానికి బాసటగా నిలుస్తున్నారు. భారత్‌-పాక్‌ మధ్య స్పర్థలు పోయి.. శాంతినెలకొనాలని చాన్నాళ్లుగా సెహీర్‌ మీర్జా పోరాడుతోంది. తాజాగా ఆమె పూల్వామా దాడిని ఖండించిన క్రమంలో అమెకు మద్దతుగా అక్కడి యువతులు కూడా బాసటగా నిలుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles