Fire kills 69 in Bangladesh capital బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం.. 70కి చేరిన మృతుల సంఖ్య

Fire breaks out in bangladesh capital multiple reported killed

Bangladesh Fire accident, Dhaka Fire accident, Dhaka chemical warehouses, Firefighters fighting situation, fire, fire breakout, bangladesh fire, warehouse fire, building on fire in Dhaka, disaster and accident

At least 69 people have died in a huge blaze that tore through apartment buildings also used as chemical warehouses in an old part of the Bangladeshi capital Dhaka, fire officials said Thursday. Firefighters were battling to bring the situation in control.

బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం.. 70కి చేరిన మృతుల సంఖ్య

Posted: 02/21/2019 11:44 AM IST
Fire breaks out in bangladesh capital multiple reported killed

బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించి సుమారు 70 మంది సజీవ దహనమయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో క్రితంరోజు సంభవించిన ఈ ఘటనలో మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల అర్థనాధాలు, బంధువుల ఏడుపులతో స్థానికంగా ఆ ప్రాంతమంతా విషాధాన్ని నిపింది. తొలుత పది మంది మాత్రమే మరణించారన్న అంచనాలు క్రమంగా 69కి చేరకున్నాయి. ఇక తాజాగా మరో క్షతగాత్రుడు కూడా మరణించడంలో మృతుల సంఖ్య 70కి చేరింది. ఒక్క భవనంలో రేగిన మంటలు క్షణాల వ్యవధిలో పూర్తిగా వ్యాపించి.. నిమిషాలలో చుట్టుపక్కల వున్న ఏకంగా ఐదు భవనాలకు వ్యాపించాయి. దీంతో ప్రమాద స్థాయి తీవ్రంగా మారి.. మృతుల సంఖ్య పెరిగింది.

చౌక్‌బజార్‌ ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లోని కెమికల్ గోదాములో చెలరేగిన మంటలు.. క్షణాల వ్యవధిలో పక్క బిల్డింగ్స్‌కు వ్యాపించాయి. చూస్తుండగానే భవనాల్లో వున్నవారు మంటల సుడిగుండంలో చిక్కకున్నారు. ఇరుకు ప్రాంతం కావడం.. బిల్డింగ్స్ మధ్య గ్యాప్ కూడా తక్కువగా ఉండటంతో ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కు మంటలు త్వరగా వ్యాపించినట్టు చెబుతున్నారు. ఫైర్ యాక్సిడెంట్ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.

అగ్నిమాపక దళాలకు సమాచారం అందించినా అవి ఘటనాస్థలానికి చేరుకునేందుకు కూడా అనేక ఇబ్బందులు పడ్డాయి. ఇక ఎలాగోలా రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. అర్థరాత్రి నుంచి మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫైర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు చౌక్ బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉందని, మంటల ధాటికి పలువురు ప్రయాణికులు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles