jyothi brother accuses of srinivas role స్నేహితులే కాలయములై.. ప్రియుడి నాటకమని అరోపణలు..

Guntur love couple attack case accused are srinivasa rao friends

chenchu srinivas, angadi jyothi, guntur police, srinivas friends, mahanadu, amaravathi stadium, Fields, sexual assault, gang rape, iron rods, sticks, Thadepally, Andhra Pradesh, Crime

Guntur love couple attack case: The Two members who attacked the lovers are chenchu srinivasa rao friends says police, but jyothi brother accuses the sketch is written by srinivas.

స్నేహితులే కాలయములై.. ప్రియుడి నాటకమని అరోపణలు..

Posted: 02/12/2019 02:59 PM IST
Guntur love couple attack case accused are srinivasa rao friends

తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన గుంటూరు జిల్లాలోని ప్రేమ జంటపై దాడి కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ప్రియుడి స్నేహితులేనని తేల్చారు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అక్కడకు చేరుకున్న శ్రీనివాస్ స్నేహితులు... ఇద్దరిపై దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారని.. అయితే వారి ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించడంతో అమెపై అగంతకులు ఇనుప రాడ్లతో దాడి చేయడంతో అమె అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు స్నేహితులే ఈ దారుణానికి తెగబడ్డారంటూ, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరి సెల్ ఫోన్ డేటా, కాల్ లిస్ట్ ఆధారంగా వెంటనే నిందితులెవరో గుర్తించారు. నిందితులిద్దరూ బైక్ పై వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పొలీసులు.. వారిని పట్టుకున్నారు. మరోవైపు జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహణకు తరలించారు.

సోమవారం  రాత్రి తాడేపల్లి, మహానాడు రోడ్డుకు చెందిన చుంచు శ్రీనివాసరావు, అతని ప్రియురాలు అంగడి జ్యోతితో కలిసి సర్టిఫికెట్ల కోసం గుంటూరు వెళుతుండగా, అమరావతి స్టేడియం సమీపానికి వీరు చేరుకోగానే.. అక్కడే వీరి రాకకోసం మాటు వేసిన శ్రీనివాసరావు స్నేహితులు వారిపై దాడి చేసి.. సమీపంలోని పోలాల్లోకి తీసుకెళ్లారు. జ్యోతిపై సామూహిక అత్యాచారానికి యత్నించారు. ఈ కేసులో నిందితులు ఇద్దరేనా.. లేక ఇంకా ఎవరైనా వున్నారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

కాగా, జరిగిన ఘటనపై స్పందించిన జ్యోతి సోదరుడు, తన చెల్లిని శ్రీనివాసరావు తన స్నేహితులతో కలిసి చంపించాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. తన సోదరి శ్రీనివాసరావును ప్రేమించిందని, పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా అడుగుతుంటే కాలయాపన చేస్తూ వచ్చాడని, చివరికిలా దారుణానికి ఒడిగట్టారని ఆరోపించాడు. వారు మాట్లాడుకోవాలంటే, రోడ్డు పక్కనే కూర్చునేవారని, రోడ్డుకు ఇంతదూరం తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. గతంలో తాను శ్రీనివాసరావును హెచ్చరించానని, కొంతకాలం దూరంగా ఉన్న అతను తిరిగి ప్రేమ పేరిట దగ్గరయ్యాడని చెప్పాడు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జ్యోతి హత్యకేసులో సంచలన అరోపణలు వెలుగులోకి రావడంతో.. పోలీసులు కూడా ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటనకు ముందు శ్రీనివాసరావు సెల్ ఫోన్ నుంచి కొందరు స్నేహితులకు ఫోన్ కాల్స్ వెళ్లాయని, వారే అత్యాచారానికి పాల్పడ్డారని, శ్రీనివాసరావుపై అనుమానం రాకుండా ఉండేందుకు అతన్ని కూడా కొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మర్డర్ వెనుక కులాంతర ప్రేమ కోణం ఏమైనా ఉందా? అనే దిశగా విచారిస్తున్నామని అన్నారు. శ్రీనివాసరావు బీసీ కులానికి చెందగా, జ్యోతి ఎస్టీ అని చెబుతున్న పోలీసులు, శ్రీనివాసరావును పూర్తి స్థాయిలో విచారిస్తేనే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు బావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chenchu srinivas  angadi jyothi  guntur police  srinivas friends  Andhra Pradesh  Crime  

Other Articles