Woman rapes a 9-year-old boy, booked under POSCO తొమ్మిదేళ్ల చిన్నారిపై మహిళ అఘాయిత్యం..

Kerala woman allegedly raped nine year old boy for several months

rape case on woman, kerala woman booked for raping boy, boy raped by woman, kerala woman, 9 yrs old boy, sexual assault, woman rapes boy, kerala police, posco act, crime

A case was registered against a 36-year-old woman in Kerala’s Mallapuram for allegedly raping a nine-year-old boy. The incident came to light after the boy revealed it to a local doctor, who then alerted Childline authorities.

తొమ్మిదేళ్ల చిన్నారిపై మహిళ అఘాయిత్యం..

Posted: 02/12/2019 01:27 PM IST
Kerala woman allegedly raped nine year old boy for several months

తొమ్మిదేళ్ల బాలుడిని లైంగికంగా హింసించిన ఘటనలో ఓ మహిళపై రేప్ కేసు నమోదైంది. కేరళలోని తెన్హిప్పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. 36 ఏళ్ల ఓ మహిళ తన పొరుగింటి బాలుడిని కొంత కాలంగా లైంగికంగా వేధించింది. బాలుణ్ని బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. బాలుడి ప్రవర్తనలో మార్పు గమనించిన అతడి తల్లి వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. ఈ భయానక విషయం వెలుగులోకి వచ్చింది.

కాగా, బాలుడికి అమె మేనత్త వరుస కూడా అవుతుందని, అయినా బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిందని బాలుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన కుమారుడిపై పొరుగింట్లో ఉండే రాజీ (36) అనే మహిళ.. లైంగికంగా వేధిస్తున్నట్లు జనవరి 12న బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడు వింతగా ప్రవర్తిస్తుండటంతో అతణ్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించింది.

కౌన్సిలింగ్ లో బాలుడిపై లైంగిక దాడి ప్రభావం జరిగిందని, బాలుడే స్వయంగా వైద్యులకు ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో.. వైద్యులు పోలీసులను అశ్రయించాల్సిందిగా తనకు చెప్పినట్లు బాలుడి తల్లి స్పష్టం చేసింది. దీంతో మహిళ వేధిస్తున్న విషయమై అమె పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతొ రంగంలోకి దిగిన పోలీసులు ఫిబ్రవరి 3న నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించి మరిన్ని వివరాలు సేకరించారు.

తాజాగా ఆమెపై అత్యాచారం కేసు నమోదు చేశారు. కేరళలోని మళయత్తూర్ పరిధిలోని కడప్పార గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, రాజీ భర్త రాయ్‌ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాడు. తన భార్యకు, బాలుడి తల్లికి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయని.. అరోపించాడు. ఈ నేపథ్యంలోనే అమె తన భార్యపై కక్ష పెంచుకొని దురుద్దేశ్యంతో.. అక్రమంగా ఇలాంటి తప్పుడు కేసు బనాయించిందని అరోపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala woman  9 yrs old boy  sexual assault  woman rapes boy  kerala police  posco act  crime  

Other Articles