Two Arrested For Attack on Former India Paceman టీమిండియా మాజీ పేసర్ పై దాడి: క్రికెటర్ సహా ఇద్దరి అరెస్టు..

Cricketer and accomplice arrested for assaulting delhi chief selector amit bhandari

Amit Bhandari, former India pacer, DDCA Chief selector, DDCA, Delhi cricket, Syed Mushtaq Ali T-20 tournament, Rajat Sharma, St. Stephen's Ground, Anuj Dheda, Nupur Prasad, cricket, crime

Delhi and District Cricket Association (DDCA) Chief selector Amit Bhandari was assaulted by an aspirant and his 14 other accomplices after he was not selected for a cricket tournament, a senior police officer said, adding the accused has been arrested.

టీమిండియా మాజీ పేసర్ పై దాడి: క్రికెటర్ సహా ఇద్దరి అరెస్టు..

Posted: 02/12/2019 12:39 PM IST
Cricketer and accomplice arrested for assaulting delhi chief selector amit bhandari

భారత మాజీ ఫాస్ట్ బౌలర్, ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్, సయ్యద్ ముస్తాక్ అలి టీ-20 టోర్నమెంట్ చైర్మన్  అమిత్ భండారిపై దాడి కేసులో ఓ క్రికెటర్ తో పాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ అండర్-23 జట్టులోకి తనను ఎంపిక చేయనందుకు కక్ష పెంచుకున్న ఓ క్రికెటర్ తన స్నేహితులతో కలసి అమిత్ భండారిపై దాడికి పాల్పడ్డాడు.

ఈ సందర్భంగా అమిత్ భండారిపై దాడి చేసిన కేసులో అనూజ్ దేడా అనే యువ క్రికెటర్ తో పాటు అతని సోదరుడిని అరెస్టు చేశామని, మిగతా 13 మంది కోసం గాలిస్తున్నామని ఢిల్లీ ఢిప్యూటీ పోలీస్ కమీషనర్ నుపూర్ ప్రసాద్ తెలిపారు. సయ్యద్ ముస్తాక్ అలి టీ20 టోర్నమెంటు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న అమిత్ భంగారి క్రితం రోజున ఉత్తర ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ ను చూస్తుండగా, అనూజ్ దేడా అనే యువ క్రికెటర్ భండారి వద్దకు వచ్చి తనను ఎందుకు అండర్ 23కి ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు.

అదే సమయంలో గోడ దూకి ఒక్కసారిగా 15 మంది వచ్చి భండారిపై ఇనుపరాడ్లు, హాకీ స్టిక్స్, సైకిల్ చైన్లతో దాడి చేశారు. ఈ ఘటనలో భండారి తల, చెవి, కాళ్ల భాగంలో గాయాలయ్యాయి. దీంతో ఆయనను సంత్ ప్రేమానంద్ అసుపత్రికి తరలించిన డిడిసీఏ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి.. మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2000-2004 మధ్య రెండు వన్డేల్లో భారత జట్టుకు భండారి ప్రాతినిధ్యం వహించాడు. రంజీల్లో ఢిల్లీ తరపున 95 మ్యాచ్ లు ఆడి 314 వికెట్లు తీశాడు. మరోవైపు ఈ దాడిని మాజీ క్రెకెటర్లు బిషన్ సింగ్ బేడీ, వీరేంద్ర సింగ్, గౌతమ్ గంభీర్ లు ఖండించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Bhandari  DDCA Chief selector  DDCA  Delhi cricket  St. Stephen's Ground  Anuj Dheda  cricket  crime  

Other Articles