loudspeaker ban: SC rejects BJP plea మమతా సర్కార్ కు సానుకూలంగా సుప్రీం తీర్పు..

Supreme court rejects bjp plea against west bengal loudspeaker ban

Loudspeaker, West Bengal, Bengal ban, Loudspeaker ban, Supreme Court, West Bengal BJP, Mamata Banerjee, poll campaign, students, studies, supreme court, sc rejects BJP plea. top court rejects BJP plea, election campaigns, politics

The Supreme Court today rejected a plea by the West Bengal BJP to set aside the Calcutta High Court's 2013 order, which had banned the use of loudspeakers in residential areas in the state. The top court said that children's studies were more important than election campaigns.

బీజేపికి ఎదురుదెబ్బ.. మమతా సర్కార్ కు సానుకూలంగా సుప్రీం తీర్పు..

Posted: 02/11/2019 02:58 PM IST
Supreme court rejects bjp plea against west bengal loudspeaker ban

పశ్చిమబెంగాల్ లోని మమతా బెనర్జీ సర్కార్ పై మరోమారు అధిపత్యం కోసం ప్రయత్నించిన బీజేపి పార్టీ బొక్కబోర్లా పడింది. లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపి.. సర్కార్ తీరును నిరసిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం బీజేపీ వాదనను తోసిపుచ్చింది. పిటిషన్‌ను కొట్టేసింది.

అదే సమయంలో మమతా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. దేశంలో రాజకీయ పార్టీల ప్రచారాలు, ర్యాలీల కంటే పిల్లల చదువులే ముఖ్యమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2013లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి, మార్చి నెలల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ రెండు నెలలు విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతుంటారని, వారికి ఈ లౌడ్‌స్పీకర్ల రణగొణ ధ్వనులు ఇబ్బంది కలిగిస్తాయని భావించిన మమత ఈ నిషేధాన్ని అమలు చేశారు.

అయితే.. నివాస ప్రదేశాల్లో, విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ నిషేధం అమలులో ఉంటుంది. మమత అమల్లోకి తీసుకొచ్చిన ఈ నిషేధం రాజకీయ పార్టీల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని, ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు సభలు నిర్వహించడం, ప్రసంగాలు ఇవ్వడం భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది బీజేపీ వాదన. కోర్టు బీజేపీ వాదనకు ఏకీభవించకపోవడమే కాకుండా పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.

దీంతో సుప్రీం కోర్టులో బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. బీజేపీ ర్యాలీకి మమత ప్రభుత్వం అనుమతిని నిరాకరించడంతో ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీజేపీకి చుక్కెదురైన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ నుంచి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. భారీగా ర్యాలీలు, సభలకు ప్లాన్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mamata Banerjee  supreme court  BJP  election campaign  Loud speakers  west bengal  

Other Articles