whatsapp account will be blocked, if you do.. రాజకీయ పార్టీలకు ‘‘వాట్సాఫ్’’ వాతలు..

Will be banned on whatsapp if you did these things

WhatsApp, Whatsapp block, Whatsapp account, Whatsapp terms of use, Whatsapp alert, Whatsapp conditions, general elections Whatsapp, election time Whatsapp conditions, Whatsapp politics, politics

WhatsApp is enhancing users experience in many ways and it is very strict regarding implementation of privacy rules and not only this, it even has the power to ban you for a host of reasons.

రాజకీయ పార్టీలకు ‘‘వాట్సాఫ్’’ వాతలు..

Posted: 02/11/2019 01:19 PM IST
Will be banned on whatsapp if you did these things

దేశంలోని టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని ఎవరెన్ని గోప్పలకు పోయినా.. ఆ ఘనత మాత్రం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుంది. శాస్త్రసాంకేతిక రంగంతో పాటు టెలికమ్యూనికేషన్ రంగంలోనూ ఆయన అనేక మార్పులు తీసుకువచ్చారన్నది కాదనలేని సత్యం. అయితే అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ప్రస్తుతం దేశంలోని అనేక వర్గాల ప్రజలు స్మార్ట్ ఫోన్లను విరివిగా వినియోగిస్తున్నారు.

ఇక స్మార్ట్ ఫోన్ సహా ప్రతిఒక్కరు సామాజిక మాద్యమాల్లో ప్రతినిత్యం నిమగ్నమవుతున్నారు. ఈ కోవలో వాట్సప్ వాడటం ఇప్పుడో పెద్ద అలవాటుగా మారింది. వాట్సప్ ను వినియోగించే భారతీయుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వాట్సప్ ను పలు విధాలుగా వినియోగించే తీరు పెరుగుతూ.. వాట్సప్ కానీ భవిష్యత్తులో ఒక్కసారి ఆగిపోతే పరిస్థితి ఏందన్న వరకూ వెళ్లింది. అయితే.. వాట్సప్ అనుసరిస్తున్న తాజా విధానం పుణ్యమా అని.. ఇలా చేస్తే మీ వాట్సప్ అకౌంట్ కూడా బ్యాన్ అవుతుంది

* రిజిస్ట్రేషన్ చేసిన ఐదు నిమిషాల్లో బల్క్ మెసేజ్ లు పంపితే బ్లాక్
* డజన్ల కొద్దీ గ్రూప్ లను వేగంగా క్రియేట్ చేస్తే మీ అకౌంట్ సీజ్ అవుతుంది
* ఇప్పటికే ఉన్న గ్రూప్స్ లో డజన్లకొద్దీ కొత్త నంబర్లను టకటకా యాడ్ చేస్తే ఆ నంబర్ బ్యాన్ అవుతుంది. ఆ గ్రూప్ కూడా డిలీట్ కావచ్చు
* వాట్సప్ లో సాధారణంగా ఎవరు టైప్ చేసినా వారి పేరుతో టైపింగ్ అని వస్తుంది. అలా కాకుండా.. ' . టైపింగ్' అని లేకుండా మీకు మెసేజెస్ వస్తుంటే.. ఆ * నంబర్ ను మీకు మీరే బ్లాక్ చేయొచ్చు. అవి స్పామ్ నంబర్లు అయి ఉండొచ్చు. వాట్సప్ కూడా వీటిని డిటెక్ట్ చేస్తుంది.
* అనుమానాస్పద లింక్ లు, అప్పటికే ఆదేశాలు జారీచేయబడిన నిషేధిత వీడియోలను ఫార్వార్డ్ చేసినా.. వాట్సాప్ ఆ అకౌంట్ ను బ్యాన్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Whatsapp  account block  general elections  conditions  politics  

Other Articles