Hyderabad Auto Driver proves his Honesty హాట్సాఫ్ ఆటోవాలా.. రూ.10లక్షలు దొరికినా..

Hyderabad auto driver proves his honesty

auto driver honesty, auto driver handovers Rs 10 lakh bag in police station, hyderabad auto driver, Rs.10 lakhs cash, cash bag, auto driver, madhapur police station, cyberabad police, latest telugu news

Hyderabad Auto Driver proves his Honesty by handovering Rs 10 lakh which was found in a bag in his auto, in madhapur police station

హాట్సాఫ్: రూ.10 లక్షలు లభించినా.. పైసా ముట్టని ఆటోవాలా..

Posted: 02/07/2019 03:35 PM IST
Hyderabad auto driver proves his honesty

కష్టపడిన సొమ్ము ఎక్కడికెళ్లినా తిరిగి వస్తుందన్న పెద్దలు చెప్పే నానుడి మరోమారు నిజమైంది. అదేంటి సొమ్మంటే పదో పరకా అనుకుంటున్నారా.. కాదు.. ఏకంగా పది లక్షల రూపాయలు. అయితే ఇక్కడ ఈ డబ్బు లభ్యం కావడానికి మాత్రం ముఖ్యకారణం ఓ ఆటోవాలా నిజాయితి. రూపాయి బిల్ల దొరికితేనే ఎవరికీ కనిపించకుండా తీసుకుని జేబులో వేసుకునేవాళ్లు.. అవతలి వాడి వద్ద డబ్బు వుందని తెలిస్తే చాలు దాన్ని ఎలా నొక్కేయ్యాలా అని అలోచించేవాళ్లు వున్న ఈ రోజుల్లో.. ఏకంగా పది లక్షల రూపాయలు లభించినా.. దానిని తీసుకెళ్లి వారికి అప్పగించిన అటో డ్రైవర్ నిజాయితీ నిజంగా ప్రశంసనీయం..

వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన కొత్తూరు కృష్ణ, ప్రసాద్ అన్నదమ్ములు వారు హైదరాబాద్ గచ్చిబౌలీలోని శ్రీరామ్ నగర్ కాలనీ ఓ ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావించారు. అందులో భాగంగా ఇవాళ ఫ్లాట్ బిల్డర్ కు పది లక్షల రూపాయాలను అడ్వాన్స్ గా చెల్లించాలని బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు విత్ డ్రా చేసుకుని ఆటోలో వస్తున్నారు. అయితే ఆ సమయంలో కంగారులో డబ్బు ఉన్న బ్యాగును ఆటోలోనే మరచిపోయారు.

కొద్దిసేపటి తర్వాత బ్యాగును గుర్తించిన ఆటో డ్రైవర్ జార్పుల రమేశ్ అందులో రూ.10 లక్షల డబ్బు ఉండటాన్ని గమనించాడు. ఎంతోమంది తన ఆటో ఎక్కుతారు కాబట్టి .. మరచిపోయిన వారు ఎవరో గుర్తించలేకపోయారు. వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగును అప్పగించారు. అయితే అప్పటికే కృష్ణ, ప్రసాద్ సోదరులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారి సమక్షంలోనే పోలీసులు బ్యాగును వారికి అప్పగించారు. నిజాయితీతో బ్యాగును అప్పగించిన ఆటోడ్రైవర్‌ను పోలీస్ అధికారులు ప్రశంసించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles