Professionals Apply For 14 Sweeper Jobs in TN Assembly స్వీపర్ పోస్టులకు ఇంజనీర్లు, ఎంబిఏ పట్టభద్రుల పోటీ

4 600 engineers mba graduates apply for 14 sweeper jobs in tn assembly

Tamil Nadu Assembly, Sweepers Job Tamil Nadu, jobs in TN Assembly, jobs in india, Unemployment in India, Engineers, MBA graduates, sweeper post, govt jobs, job security, India youth, budget 2019, Assembly, Secratairat, Tamil Nadu, politics

Believe it or not, persons with professional qualifications such as M.Tech, B.Tech and MBA, post graduates as well as graduates are in the race to bag the work of sweepers and sanitary workers in the Tamil Nadu Assembly Secretariat.

14 స్వీపర్ పోస్టులు: ఇంజనీర్లు, ఎంబిఏ పట్టభద్రుల పోటీ

Posted: 02/07/2019 04:19 PM IST
4 600 engineers mba graduates apply for 14 sweeper jobs in tn assembly

నిరుద్యోగ భారతంలో ఏ రాష్ట్రం చూసినా ఏమున్నది గర్వకారణం.. ఉన్నత విద్యార్హతలు వున్నా.. స్వీపర్ పోస్టులకు కూడా లభించక.. ఎండే డొక్కలు.. మండే గుండెలు అలమటిస్తున్నాయి అని ఇప్పటి యువత ఎంతగానో అంగలార్చుతున్నారు. ఏ ఉద్యోగాలు లభించక.. చాలీచాలని జీతాలతో.. జీవితాలను ఈడ్చుతున్నారు. ఊరికే వుండే బదులు ఏదైనా చేయచ్చుగా అని సలహాలు ఇచ్చే వారే కానీ.. అవకాశాలు కల్పించేవారు మాత్రం కనబడటం లేదు. దొరికిన తాత్కాలిక ఉద్యోగం తమకు భద్రత కల్పించదని, మరో రకంగా వెట్టి చాకిరీ చేసేలా వున్నా కిమ్మనకుండా రాజీపడుతూ చేస్తున్నారు.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటారా.. తాజాగా వచ్చిన నోటిఫికేషన్ ఈ పరిస్థితిని కల్పిందించిస్వీపర్ పోస్టుల కోసం వేలాది మంది ఇంజినీరింగ్, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు అసెంబ్లీలో 14 స్వీపర్ పోస్టుల కోసం ప్రకటన వెలువడింది. ఈ ఉద్యోగాల కోసం ఏకంగా 4,600 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 150 మంది ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, పీజీలు చేసినవారు ఉన్నారు.

వీటిలో అసంపూర్ణంగా ఉన్న 677 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. వాస్తవానికి ఈ ఉద్యోగాలకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు ఇది అద్దంపడుతోందని ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. నెలసరి వేతనం రూ. 17వేలు ఉండటం వల్లే ఉన్నత విద్య చదివిన వారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేశారని అధికార అన్నాడీఎంకే స్పందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Engineers  MBA graduates  sweeper post  govt jobs  budget 2019  Assembly  Secratairat  Tamil Nadu  

Other Articles