vijaya shanti slams one person hype in BJP కమలానికి బాబు దూరమైంది అందుకే: షాకు శాంతి కౌంటర్

Vijaya shanti counters amit shah on tdp quiting nda

Vijaya Shanti, Congress, BJP, NDA, TDP Amit Shah, Chandra Babu, Andhra Pradesh, 2019 Lok Sabha elections, BJP-ShivSena, Narendra Modi, Shtugan sinha, Yeshwanth sinha, Politics

congress leader vijaya shanti counters BJP National president Amit Shah on Andhra Pradesh CM ChandraBabu quiting NDA only due to one person hype in the party.

కమలానికి బాబు దూరమైంది అందుకే: షాకు శాంతి కౌంటర్

Posted: 02/07/2019 11:32 AM IST
Vijaya shanti counters amit shah on tdp quiting nda

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన విమర్శలు, అరోపణలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. అయితే ఆ పార్టీ కాకపోయినా.. అంతకుమించిన స్థాయిలో ధీటుగా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి. టీడీపీ నాలుగేళ్ల తమతో సక్యంగా కొనసాగి రాష్ట్రానికి అన్ని వనరులు సమకూర్చిన తరువాత.. సరిగ్గా ఎన్నికల సమయంలో ఆయన తమ నుంచి దూరమయ్యారని అమిత్ షా విమర్శల నేపథ్యంలో విజయశాంతి ధీటుగా స్పందించారు.

బీజేపిలో ప్రస్తుతం కేవలం ప్రధాని మోదీ నామజపం లేదంటే అమిత్ షా ఆధిపత్యం కనబడుతొందని విజయశాంతి విమర్శించారు. ఏబీ వాజ్ ఫాయ్, అద్వానీల హాయంలో పార్టీకి ప్రాధాన్యత లభించిందని, కానీ ఇప్పడు వ్యక్తులకే ప్రాథాన్యత లభిస్తోందని అన్నారు. ప్రస్తుతం బీజేపిలో ఓ వ్యక్తి చుట్టూ ఆ పార్టీ తిరుగుతుండడం వల్లే పార్టీకి సీనియర్లు దూరమవుతున్నారని విజయశాంతి విమర్శించారు. కూటమిలోని మిత్ర పక్షాలను బీజేపీ లెక్కచేయడం లేదని, వాటి అవసరం లేకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కలలు కంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికలు మోదీకి, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతాయని ఆయన చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. ఇలా ఓ వ్యక్తి చుట్టూ బీజేపీ తిరగడం వల్ల, మోదీ ఆధిపత్య ధోరణి వల్లే సీనియర్ నేతలు ఆ పార్టీకి రాం రాం చెబుతున్నారని విమర్శించారు. ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు తప్పుకోవడానికి కూడా కారణం అదేనని ట్విట్టర్ ద్వారా విజయశాంతి పేర్కొన్నారు.  ఇంత జరుగుతున్నా పార్టీలో ఇంకా మోదీ భజనే జరుగుతుండడం ఆయన నిరంకుశత్వానికి అద్దం పడుతోందని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ప్రకటనపై శివసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందేనని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijaya Shanti  Congress  BJP  NDA  TDP Amit Shah  Chandra Babu  Andhra Pradesh  Politics  

Other Articles