‘antinatalist’ Raphael Samuel sues his parents తల్లిదండ్రులను కోర్టుకీడ్చిన కొడుకు.. ఎందుకంటే..

Mumbai man who sued his parents for having him reveals his reason

India, Anti-natalism, Anti-natalist raphael Samuel, Consent to be born, Raphael Samuel, anti-natalist, philosophical questions, lawyer parents, Raphael Samuel’s Facebook, Nihil Anand, viral Video, video viral

Mumbai-based Raphael Samuel claims he is suing his parents, self-confessed antinatalist – espousing a philosophical opposition to procreation – Samuel has recently posted a video answering the questions he is commonly asked.

ITEMVIDEOS: ‘‘నన్నెందుకు కన్నారు?’’ తల్లిదండ్రులను కోర్టుకీడ్చిన కొడుకు..

Posted: 02/07/2019 10:42 AM IST
Mumbai man who sued his parents for having him reveals his reason

నా అనుమతి లేకుండా నన్నెందుకు కన్నారు.. అంటూ ఓ 27 ఏళ్ల కుర్రాడు తన తల్లిదండ్రులను కోర్టుకీడ్చాడు. వినడానికే విచిత్రంగా వున్నా ఈ కుర్రాడి వదనలో మాత్రం కొంత బలముందని యువత విశ్విసిస్తున్నారు. అంతేకాదు ఈ కుర్రాడు పోస్టు చేసిన ప్రశ్నల వర్షం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. తన అనుమతి లేకుండా తనను కన్నందుకు తన తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలన్న యువకుడి పోస్టును యువత షేర్ చేసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన రాఫెల్ శామ్యూల్ (27) తన ఫొటోపై ఇలా రాసి పోస్టు చేశాడు. గుబురు గడ్డం, మీసంతో ఉన్న శామ్యూల్.. తన తల్లిదండ్రులు అంటే తనకూ ఇష్టమేనని పేర్కొన్నాడు. అయితే, తనకు ఇష్టం లేకుండా ఈ భూమ్మీదకి వచ్చి తానెందుకు బాధపడాలని, తానెందుకు పనిచేయాలని ప్రశ్నిస్తున్నాడు. తాను పెరిగేందుకు తల్లిదండ్రులు తనకు ఖర్చు చేయాలని, ఇక తాను జీవితాంతం బతికేందుకు కూడా వారు వెచ్చించాలని డిమాండ్ చేస్తున్నాడు.

అయితే తనను ఇది చదువు అది చదువు అంటూ వేధించడం.. తనపై ఒత్తడి చేయడం సమంజసం కాదని, తనకు ఇష్టం లేనిది ఎందుకు చేయాలని కూడా వాదిస్తున్నాడు. ఇక వారు తమకోసం వెచ్చించడం తమ బాధ్యత అని వాదిస్తున్న రాఫెల్ తాను వారి సొంత కాదని కూడా తేల్చిచెబుతు వైర్యాగ్య ధోరణి కూడా వినిపిస్తున్నాడు. అయితే తనకు తన తల్లిదండ్రులంటే ఇష్టమని తాను వారి బాగోగులు చూసుకుంటానని అంటున్న ఆయన.. పిల్లలకు నచ్చితేనా వారి బాగోగులు చూసుకుంటారని, అంతేకానీ.. తప్పనిసరిగా చూడాల్సిన అవసరమేంటని  ప్రశ్నిస్తున్నాడు.



తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు ఎవరికెవరూ సొంత కాదని అన్నారు. నిజానికి శామ్యూల్ ఓ యాంటీ నాటలిస్ట్. ఇటువంటి వారు పిల్లలు కనడాన్ని వ్యతిరేకిస్తారు. పిల్లల్ని కనడమంటే భూమిపై భారాన్ని పెంచడమేనని, జీవితంలో బాధలు తప్ప మరేమీ ఉండవనేది వీరి అభిప్రాయం. ఇదే విషయాన్ని శామ్యూల్ తల్లిదండ్రులతో కూడా చెప్పాడట. తాను చెప్పింది విని తన తల్లి ఆశ్చర్యపోలేదని, అనుమతి తీసుకోకుండా కనడం తప్పని అనిపిస్తే, ఆ తప్పును ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తల్లి తనతో చెప్పారని శామ్యూల్ పేర్కొన్నాడు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles