Travancore Devaswom Board says women can enter shrine శబరిమలలోకి మహిళల ఎంట్రీపై ట్రావన్కోర్ బోర్డు యూ-టార్న్

Sabarimala in u turn travancore devaswom board says women can enter shrine

sabarimala, sabarimala review petitions, travancore devaswom board, sabarimala review pleas, supreme court, Rakesh Dwivedi, Women entry, Politics

The board that manages Kerala's Sabarimala temple says it is no longer against admitting women of all ages, and has informed the Supreme Court of the change in its position. The TDB told the apex court that it had changed its stand on the ban.

మహిళల ఎంట్రీపై ట్రావన్కోర్ బోర్డు యూ-టార్న్

Posted: 02/06/2019 06:36 PM IST
Sabarimala in u turn travancore devaswom board says women can enter shrine

శబరిమల కొండపై కొలువైన అయ్యప్పస్వామి దేవాలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సులోని మహిళల ప్రేవేశాన్ని నిషేధించిన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు.. తాజాగా యూ-టార్న్ తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ 28న దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన బోర్డు ఈ తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలని కూడా నిర్ణయించింది. అయితే తాజాగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంది.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మేరకు అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ వెలువరించిన తీర్పును తాము గౌరవిస్తామని రివ్యూ పిటీషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. గతంలో వెలువరించిన తీర్పుపై కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్‌ బోర్డు, నాయర్‌ సర్వీస్‌ సొసైటీ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ట్రావెన్‌ కోర్‌ బోర్డు తరఫున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపిస్తూ.. ‘మతాచారాలు ఎలాంటి లింగబేధం లేకుండా అందరికీ సమానంగా ఉంటాయని ఆర్టికల్‌ 25(1) చెబుతోందని అన్నారు. జీవ సంబంధిత లక్షణాల కారణంగా మహిళలపై వివక్ష చూపించడం సరికాదని దీంతో శబరిమలకు  మహిళల నిషేధం లేకుండా తాము న్యాయస్థానం తీర్పును అచరిస్తామని అన్నారు. తాజాగా మహిళల ప్రవేశంపై బోర్డు తన వైఖరి మార్చుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles