Nitin Gadkari only one in BJP with some guts: Rahul Gandhi గడ్కరీ అటాక్.. రాహుల్ వర్క్ అవుట్..

Only one in bjp with some guts rahul gandhi on nitin gadkari

ABVP, Nitin gadkari, Rahul Gandhi, Narendra Modi, Amit Shah, BJP, Congress, central minister nitin gadkari, nitin gadkari sensational comments, congress chief rahul Gandhi, rahul Gandhi praising nitin gadkari, pm narendra modi, bjp chief amit shah, Modi government, Politics

Congress president Rahul Gandhi complimented Union minister Nitin Gadkari for his remarks, saying he has guts and should also comment on the Rafale deal, "farmers distress and destruction of institutions".

బీజేపిలో దమ్మున్నది నీకే.. వీటిపై కూడా మాట్లాడవా.?: రాహుల్

Posted: 02/04/2019 08:32 PM IST
Only one in bjp with some guts rahul gandhi on nitin gadkari

రాజకీయ నేతలు సంచలనాల కోసం మాట్టాడటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. ఇక ఎన్నికల సమయం ముంచుకోస్తుందంటే ఏడాది నుంచి నేతల మాటల తూటాలు మార్మోగిపోతుంది. ఇక తమ మాటల వెనుక దాగున్న అర్థం ఏంటో తెలియకుండా తికమకపెట్టే విధంగా అర్జునుడి బాణంలా కూడా నేతలు తమ మాటలను సంధిస్తారు. ముందున్న అద్దంలోకి చూస్తూ వెనుకనున్న లక్ష్యాన్ని సంధించడంలో మన నేతలు అర్జునుడిని మించిన ఘణాపాటీలే.

ఇక తాజాగా నితిన్ గడ్కరీ చేసిన కామెంట్లను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ.. తమ పార్టీకి అనుకూలంగా మలిచేసుకుని తెగ వాడేసుకుంటున్నారు. నితిన్ గడ్కరీ ఉద్దేశ్యం ఏమిటో తెలియదు గానీ.. ఇటీవల ఆయన చేస్తున్న సంచలన కామెంట్స్ బీజేపీని ఇరుకున పెట్టేస్తున్నాయి. తాజాగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ చేసీన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

చాలామంది కార్యకర్తలు పార్టీ కోసం ఏదైనా చేస్తామని చెబుతుంటారు. ముందు వాళ్లంతా తమ కుటుంబాన్ని, పిల్లల్నీ పట్టించుకోవాలి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలను చూసుకోలేనివాళ్లు దేశాన్ని ఏం కాపాడుతారు?’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. కచ్చితంగా.. ఆయన మోదీని ఉద్దేశించే చేసి ఈ వ్యాఖ్యలు చేసిఉంటారనే ప్రచారం ఊపందుకుంది.

గడ్కరీ అన్నది మోదీని ఉద్దేశించేనా? అన్నది పక్కనబెడితే, ఆ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలిచేసుకున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. ట్విట్టర్ వేదికగా గడ్కరీని ప్రశంసలతో ముంచెత్తారు. బీజేపీలో దమ్మున్న నాయకుడు ఆయనొక్కరే అంటూ గడ్కరీని ఆకాశానికి ఎత్తేశారు. ఇదే విధంగా, రాఫెల్ డీల్ విషయంలో అనీల్ అంబాని కంపెనీ విషయంపై కూడా ఆయన మాట్లాడాలని కోరారు. అంతేకాదు రైతుల ఆత్మహత్యలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని.. వ్యవస్థల నిర్వీర్యం చేయడంపై మాట్లాడాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ABVP  Nitin gadkari  Rahul Gandhi  Narendra Modi  Amit Shah  BJP  Congress  Politics  

Other Articles