Nampally exhibition to reopen in 2 days నుమాయిష్ బాధితులను పొడిగింపుతో అదుకుంటాం: ఈటెల

Numaish to reopen in 2 days ts govt to compensate affected stall owners

etela rajender, exhibition grounds, exhibition society, home minister, numaish, cigeratte, fire break, home minister mohammed mehmood ali, numaish, revenue division officers (rdos), fire at numaish, cigeratte caused fire break at numaish, crime

President of the Exhibition Society and senior TRS party leader, Etela Rajender, said all possible assistance would be extended to nearly 300 stall owners who lost their livelihood in the massive fire at Numaish.

నుమాయిష్ బాధితులను పొడిగింపుతో అదుకుంటాం: ఈటెల

Posted: 01/31/2019 03:54 PM IST
Numaish to reopen in 2 days ts govt to compensate affected stall owners

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతీ ఏడాది నిర్వహించే నుమాయిష్ (ఎగ్జిబిషన్)లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఉత్ప్తుతులు నష్టపోయిన వారిని అదుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అగ్రి ప్రమాదంలో ఆస్తి నష్టపో్యిన వారితోపాటు ఎగ్జిబిషన్ కమిటీ కూడా తీవ్రంగా బాధపడుతోందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ జరగని ఇలాంటి ఘటనపై ఈటల అధ్యక్షతన పాలకవర్గ సమావేశమైంది.

ఈ సమావేశంలో అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు ఏంటి అన్న కోణంలో విశ్లేషించారు. దీంతోపాటు ఆస్తి నష్టం ఏ మేరకు జరిగిందన్న అంశంపై కూడా చర్చించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ నుంచి వ్యాపారులు ఏ ఆశతో వచ్చారో అదే ఆశతో వెళ్లేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నుమాయిష్ ను మరో పక్షం రోజుల పాటు పొడగిస్తూన్నామని, ఈ పక్షం రోజల వ్యవధిలో వచ్చే అదాయానంతా బాధితులకు పంచుతామని ఆయన చెప్పారు.

అయితే ఇవాళ రేపు ఘటనలో పూర్తిగా ధగ్ధమైన స్టాలను పునర్నిర్మింపజేస్తామని చెప్పారు. దీంతో ఇవాళ రేపు నుమాయిష్ కు సెలవుప్రకటిస్తున్నామని చెప్పారు. కాగా, అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. నలభై ఏళ్లుగా స్టాళ్ల నిర్వాహకులతో తాము కుటుంబంగా కలిసి పనిచేస్తున్నామన్నారు. ప్రమాదం దృష్ట్యా ఈరోజు, రేపు రెండు రోజులపాటు ఎగ్జిబిషన్‌ను నిలిపివేస్తున్నట్లు ఈటల ప్రకటించారు. స్టాళ్లను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.

ఎగ్జిబిషన్ సొసైటీ ప్రైవేటు సంస్థ కాదని.. ఒక లక్ష్యం కోసం ఏర్పడిందన్నారు. వ్యాపారం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే సంస్థగా ఈటల పేర్కొన్నారు. సొసైటీ ద్వారా వచ్చే లాభాలను పేద ప్రజలు, విద్యార్థుల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. స్టాళ్ల యాజమానులకు భోజనం ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. అగ్ని ప్రమాద ఘటనపై సాయంత్రానికి నివేదిక వస్తుందని.. త్వరగా సహాయం చేస్తామని ఆయన వివరించారు. ఇక బాధిత స్టాళ్ల యజమానులకు వారి ఫీజును వెనక్కి ఇచ్చేస్తామని కూడా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : etela rajender  exhibition society  home minister  numaish  cigeratte  fire break  crime  

Other Articles