Govt working for New India: President ‘‘అవినీతి రహిత నవభారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం’’

Modi govt working for new india has given hope to people president

India,ram nath kovind,President Kovind,New India,Narendra Modi,mahatma gandhi,democracy

President Ram Nath Kovind said his government has commenced its journey towards building a New India where every person has access to basic amenities, gets justice with dignity, is healthy, secure and educated, has equal opportunities.

‘‘అవినీతి రహిత నవభారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం’’

Posted: 01/31/2019 02:56 PM IST
Modi govt working for new india has given hope to people president

నవభారత నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి... అవినీతి రహిత పాలన అందించే లక్ష్యం దిశగా ప్రభుత్వ పనిచేస్తుందని అన్నారు. గాంధీజీ కలలు కన్నదిశగా భారత్ పురోగమిస్తోంది, బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువల ఆధారంగా ముందుకు సాగుతోందని అన్నారు.

దేశంలోని పేదలందరికీ గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లు వంటి మౌలిక వసతులను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నిర్దేశించారు. వీరిని దృష్టిలో పెట్టుకునే పలు పథకాలను రూపొందించామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో దేశంలోని 50 కోట్ల మందికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించామని అన్నారు. హృద్రోగులకు అందించే స్టంట్‌ల ధరలు తగ్గించామని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా మహిళల గౌరవం పెంచామని వెల్లడించారు. మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా మూడు కోట్ల కుటుంబాల ఆరోగ్యం మెరుగైందని అన్నారు.

తక్కువ ప్రీమియంతో పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. 18 వేలకు పైగా గ్రామాల్లో విద్యుదీకరణ చేపట్టామని వెల్లడించారు. దేశంలోని ప్రతి ఒక్క ఇంటికి విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. నిరుపేదలకు సైతం వంటగ్యాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలా తమ ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోందని తెలిపారు. ముద్రా యోజన ద్వారా ఎంతో మంది ఔత్సాహికులు పారిశ్రామిక వేత్తలుగా మారారని అన్నారు. 40 వేల గ్రామాల్లో వైఫై సౌకర్యం కల్పించామని రాష్ట్రపతి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  ram nath kovind  President Kovind  New India  Narendra Modi  mahatma gandhi  democracy  

Other Articles