AP deputy CM upset over TTD officials ప్రభుత్వాన్ని శాసిస్తున్న ఉద్యోగులు: కేఈ సంచలన వ్యాఖ్యలు

Ap deputy cm ke krishnamurthy upset over ttd officials

AP deputy CM, KE Krishnamurthy, Venkateswara Swamy temple, Amaravati, Tirumala Tirupati Devasthanams, Invitation, Endowments Ministry, Andhra Pradesh, AP government, Politics

AP deputy CM KE Krishnamurthy expressed anger over the TTD officers, for had missed inviting Krishnamurthy for the groundbreaking ceremony of the Venkateswara Swamy temple in Amaravati.

ప్రభుత్వాన్ని ఉద్యోగులు శాసిస్తున్నారు: కేఈ సంచలన వ్యాఖ్యలు

Posted: 01/31/2019 04:53 PM IST
Ap deputy cm ke krishnamurthy upset over ttd officials

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.150 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఇవాళ ఆ ఆలయానికి భూకర్షణం, బీజావాపన కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నిర్వహించింది. ఇంతవరకు బాగానే వున్నా.. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తికి మాత్రం ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి కనీసం సమాచారం.. లేదా అహ్వానం కూడా అందించలేదు.

దీంతో గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని జరిగిన భూకర్షణం, బీజావాపనం కార్యక్రమానికి తనకు అహ్వానం అందకపోవడంతో తనకు పరాభవం జరిగిందని మంత్రి కేఈ కృష్ణమూర్తి భావిస్తున్నారు. దీంతో టీటీడీ అధికారుల తీరుపై మంత్రి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకుని గైర్హాజరు అయ్యారు. సాక్షాత్తూ దేవాదాయ శాఖ మంత్రికే ఆహ్వానం అందకపోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంధ్రప్రదేశ్ లో కోందరు ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోయారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులను దారికి తీసుకురావడంలో ప్రభుత్వ పెద్దలకు కొన్ని పరిమితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ట్రస్టు బోర్డు నియామకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫైల్ పంపి 3 నెలలు అవుతుందని కేఈ అన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఉందన్నారు. ఆలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయకుంటే సమస్యలు వస్తాయని కేఈ కృష్ణమూర్తి అన్నారు. తనకు రెవిన్యూ శాఖ కంటే దేవాదాయ శాఖను నిర్వహించడం కష్టంగా మారిందని తెలిపారు.

దేవాదాయ శాఖను వదులుకోవాలని అనిపిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా గుంటూరులోని వెంకటపాలెంలో నిర్మించే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి సీఆర్డీఏ టీటీడీకి 25 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదు ఎకరాల్లో ఆలయం, మిగిలిన 20 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. ఈ 20 ఎకరాల్లో ఆలయానికి అనుబంధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఆడిటోరియాలు, కల్యాణమండపాలతో పాటు ఇతర కీలక నిర్మాణాలు చేపట్టనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP deputy CM  KE Krishnamurthy  Venkateswara Swamy temple  Amaravati  AP government  Politics  

Other Articles