Former Union minister George Fernandes dies at 88 కార్మీక, పేదల హక్కుల ఉద్యమ కిరీటి జార్న్ ఫెరాండెజ్ కన్నుమూత

Former defence minister george fernandes passes away

george fernandes, george fernandes death, george fernandes death news, george fernandes news, george fernandes death date, george fernandes dead, george fernandes died, george fernandes dead or alive, george fernandes latest news, george fernandes passes away, george fernandes age, george fernandes

George Fernandes, former Union minister and nine-time Lok Sabha MP, passed away Tuesday morning at the age of 88 following a prolonged illness. He had been bedridden for the past few years.

కార్మీక, పేదల హక్కుల ఉద్యమ కిరీటి జార్న్ ఫెరాండెజ్ కన్నుమూత

Posted: 01/29/2019 10:35 AM IST
Former defence minister george fernandes passes away

కేంద్ర మాజీ రక్షణశాఖామంత్రి జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. సోషలిస్టు బావాలు కల్గిన నేతగా పేదల పక్షాన నిష్పక్షపాతిగా పోరాటం చేసి.. వారి హక్కుల కోసం ఉద్యమించిన కెరటం అస్తమించింది. మరీ ముఖ్యంగా కార్మిక సంఘం నేతగా ఆయన కార్మికుల పక్షాన నిలియి వారికి న్యాయబద్దంగా రావాల్సిన హక్కులను కల్పించారు. కార్మిక కిరీటీ, పేదవాళ్ల ఉద్యమ కెరటంగా ఆయన చేసిన సేవల అనన్యమైనవి.

సుదీర్ఘకాలంగా ఆనారోగ్యంతో బాధపడిన ఆయన ఇవాళ తన తుదిశ్వాస విడిచారు. అట్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన దేశాన్ని శత్రుదేశాల కుట్రలు, కుతంత్రాల నుంచి సురక్షితంగా వుంచడంలోనూ తన వంతు కృషి చేశారు. ఆయన నేతృత్వంలోనే భారత ఆర్మీ కార్గిల్ యుద్దానికి దిగి.. శతృసేనలను సరిహద్దుల నుంచి తరమికొట్టింది. ఇప్పటికీ కార్గీల్ యుద్దాన్ని గుర్తుచేసుకుంటూ, వీర సైనికులకు ఆత్మశాంతి కోసం భారత ఆర్మీ విజయ్ దివాస్ ను జరుపుకుంటుంది.

కాగా కొన్నేళ్లుగా అల్జీమర్స్ తో బాధపడుతున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం స్వైన్ ఫ్లూ సోకింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన 88 ఏళ్ల వయస్సులో మరణించారు. 1930 జూన్ 3న మంగళూరులో జన్మించిన ఆయన, 1967లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. జనతాదళ్ పార్టీలో కీలక నేతగా ఎదిగి, ఆపై సమతా పార్టీని స్థాపించిన ఆయన, రక్షణ శాఖతో పాటు సమాచార, పరిశ్రమల, రైల్వే శాఖలను కూడా నిర్వహించారు. ఫెర్నాండెజ్ కు ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : George Fernandes  Atal Bihari Vajpayee  Janata Dal  Former defence minister  Samata Dal  

Other Articles