'She's Like a Sister' says Siddaramaiah మైకుతో పాటుగా మహిళ చున్నీలాగిన మాజీ సీఎం

Siddaramaiah loses cool at woman during public meeting

Siddaramaiah woman spat,siddaramaiah,karnataka chief minister,Karnataka, Politics

Karnataka Former CM Siddaramaiah landed in a controversy when he engaged in a verbal duel with a woman and snatched the microphone from her, dislodging her dupatta in the process at an event in Varuna in Mysuru.

ITEMVIDEOS: మైకుతో పాటుగా మహిళ చున్నీలాగిన మాజీ సీఎం

Posted: 01/28/2019 06:48 PM IST
Siddaramaiah loses cool at woman during public meeting

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ఐదేళ్ల హాయంలో ఎన్నడూ విచక్షణ కోల్పోయి ఎవరితోనూ వ్యవహరించని ఆయన కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తు్న క్రమంలో మాత్రం ఓ మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. తానో ప్రజాప్రతినిధినన్న విషయాన్ని మర్చిపోయి.. అమె చేతిలోని మైకును లాక్కునే క్రమంలో అమె చున్నీని కూడా లాగారు. బెదిరించి ఆమెను బలవంతంగా కూర్చొబెట్టారు.

కర్నాటకలోని వరుణ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య.. సంయమనం కోల్పోయారు. కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించింది జమీల. ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయడం లేదంటూ సిద్ధరామయ్య కూర్చున్న టేబుల్ ముందుకు వెళ్లి చెప్పింది. దీంతో కోపం తెచ్చుకున్న సిద్ధరామయ్య.. ఆమె చేతిలోని మైకును లాగే క్రమంలో చున్నీని కూడా లాగి పడేశారు. ఆమె భుజంపై చేయిపెట్టి బలవంతంగా కూర్చోబెట్టారు. మెల్లగా మాట్లాడు అంటూ బెదిరించారు.

తాను కూర్చున్న టేబుల్‌పైన చేయిపెట్టినందుకే సిద్ధరామయ్యకు కోపం వచ్చిందని జమీల చెబుతోంది. ఆ మాత్రం దానికే ఆయన హూందాతనం మర్చిపోయి... దిగజారిపోయి ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్రంగా అవమానించారని చెప్పింది. తానేం తప్పుగా మాట్లాడలేదని, అయినా ఆయన తనను అందరి ముందూ అవమానకరంగా మాట్లాడారని, దురుసుగా ప్రవర్తించారని చెప్పింది.

వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య కుమారుడు ప్రాతినిథ్యం వహిస్తుండడం విశేషం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నియోజకవర్గంలో అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించడంతో కోపం తెచ్చుకున్న సిద్ధరామయ్య సంయమనం కోల్పోయి ప్రవర్తించారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పుడే కాదు, గతంలో చాలా సందర్భాల్లోనూ ఇలాగే ప్రవర్తించి సిద్ధరామయ్య వివాదాల్లో చిక్కుకున్నారు.

కాగా ఈ ఘటన యాధృచికంగా జరిగిందే కానీ కావాలని, తప్పుడు ఉద్దేశ్యంతో చేసినది కాదని ఆ తరువాత సిద్దరామయ్యా తెలిపారు. జమలా అనే కాంగ్రెస్ పంచాయితీ సభ్యురాలిని తాను గత దశామున్నర కాలం నుంచి ఎరుగుదునని అన్నారు. అమె తన చెల్లితో సమానమని చెప్పారు. ఇక జమీలాను మీడియా కూడా జరిగిన ఘటనపై ప్రశ్నించగా సిద్దరామయ్య చాలా ఉత్తమ ముఖ్యమంత్రి అని అమె పేర్కోన్నారు. తాను అవేశంతో ప్రశ్నించడం.. బల్లను చరచడం వల్లే ఆయనకు కోపం వచ్చిందని అమె అన్నారు. తాను అలా మాట్లాడివుండాల్సింది కాదని కూడా జమీలా అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah woman spat  siddaramaiah  karnataka chief minister  Karnataka  Politics  

Other Articles