AP celebrates 70th Republic Day బెజవాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Andhra pradesh joins nation in celebrating 70th republic day

Republic day, 70th Republic day, republic day-2019, republic day celebrations, republic day celebrations Andhra pradesh, Andhra pradesh republic day celebrations, AP republic day celebrations, republic day governor, republic day narasimhan, Indira Gandhi Stadium, Vijayawada, Governor, Andhra Pradesh government

Governor ESL Narasimhan raised the national flag and took the salute from the colourful ceremonial parade at Indira Gandhi Stadium at Vijayawada of Andhra Pradesh

విజయవాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Posted: 01/26/2019 12:13 PM IST
Andhra pradesh joins nation in celebrating 70th republic day

ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ది చెందిందని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ అన్నారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ అభివృద్ది పథకాలు.. రాష్ట్ర పురోగతిపై గవర్నర్ ప్రసంగించారు. మరీ ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం అగ్రస్తానంలో నిలిచిందని టాప్‌లో నిలిచిందని గుర్తుచేశారు. అందుకే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. అనంతరం పోలీస్ బెటాలియన్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఘనంగా జరిగిన వేడుకులను ఆయన తిలకించారు. అంతకుముందు ఆయన 70వ గణతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రసంగిస్తూ.. వ్యవసాయ ఆధారిత రంగాల్లో రాష్ట్రం 11శాతం అభివృద్ది సాధించిందని గవర్నర్ పేర్కొన్నారు.

జనవరి 2 నుంచి ప్రభుత్వ పెన్షన్లను రూ.2వేలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే కాపులకు ప్రభుత్వం 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు చెప్పారు.విభజన కష్టాలను ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా అధిగమిస్తోందని, సాంకేతికతను జోడించి అభివృద్ది వైపు పయనిస్తోందని అన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందన్నారు.

అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 70 ఏళ్లలో దేశం ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని.. ప్రపంచంలోనే అభివృద్దిలో ఏపీ అత్యంత వేగంగా దూసుకెళ్తోందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles