Kanakadurga Locked Out By In-Laws శబరిమలలోకి వెళ్లింది కానీ.. సోంతింట్లోకి..

Husband keeping me out says kanaka durga who entered sabarimala

ayyapa, Bindhu, Kanaka Durga, lord ayyapa, In laws house, kanaka durga shelterless, security, domestic violence, Perinthalmanna shelter home, Sabarimala, supreme court, politics, crime

Kanaka Durga, one of the two women who made history by entering the Sabarimala temple in Kerala this month, is now homeless after her family disowned her.

కనకదుర్గ కష్టాలు: శబరిమలలోకి వెళ్లింది కానీ.. సోంతింట్లోకి..

Posted: 01/23/2019 11:20 AM IST
Husband keeping me out says kanaka durga who entered sabarimala

కొత్త సంవత్సరంలో ఏదో ఒకటి కొత్తగా చేసి.. తన పేరును దేశవ్యాప్తంగా వినిపించేలా చేయాలని భావించిన కనకదుర్గ.. తాను అనుకున్నది అనుకున్నట్లు చేసినా.. ఇంట మాత్రం ఓడిపోతుంది. దీంతో ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్లుగానే అమె పరిస్థితి తయారైంది. ఇంతకీ అమె ఎవరో తెలుసా.? జనవరి రెండో తేదీన వేకువ జామున సనాతన అచారాలను, శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను పక్కనబెట్టి.. స్థానికులు, అయ్యప్పస్వాముల కేరళ భక్త సమాజం, హింధూ సంఘాల బెదిరింపులకు తోపిరాజుతూ.. తొలిసారిగా శబరిమల అలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలలో అమ ఒకరు.

హెచ్చరికలను పట్టించుకోకుండా బింధుతో కలసి శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన అమె.. ఇప్పుడు తన సొంతిట్లోకి మాత్రం వెళ్లే పరిస్థితి లేదు. తన అత్తారింటి సభ్యులు కూడా వ్యతిరేకించే పనిచేయడం.. ఈ క్రమంలో అత్తారింటికి సభ్యులు అమెపై ప్రతికార చర్యలకు పాల్పడుతున్నారు. అమె పండగ పర్వదినాన అత్తారింటికి వెళ్లగా అమెపై అత్త బౌతికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మంగళవారం అమె భర్త కూడా అమెను మెడ పట్టి భయటకు గెంటేశాడు. దీంతో అమె సొంతింటివాళ్లపైనే న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

దేశ సర్వోన్నత న్యాయస్థానం సెప్టెంబర్ 28న శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునని తీర్పును వెలువరించిన తరువాత జనవరి 2న బింధు, కనకదుర్గలు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తరువాత ఏకంగా 16 రోజుల వ్యవధిలో మరో 49 మంది మహిళలు ప్రవేశించారని కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపింది. అయితే వీరందరికీ కేరళ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం అదేశించింది.

పరాయి వ్యక్తులు, సంఘాలు దాడి నుంచి భద్రతా సిబ్బంది కాపాడగలుగుతారేమో కానీ.. ఏకంగా కుటుంబసభ్యుల నుంచే దాడులు ఎదరుకావడంతో కనకదుర్గ న్యాయపోరాటానికి సిద్దమైంది. తనను ఇంటి నుంచి గెంటివేయాలన్న నిర్ణయం తన భర్త తీసుకువ్నదేనని.. దీనిపై తాను అతనిపై గృహహింస కేసును నమోదు చేశారని చెప్పిన అమె.. ప్రస్తుతం తాను ప్రభుత్వ వసతి గృహంలో వుంటున్నానని చెప్పారు.

ఇక తాను శబరిమల అలయ దర్శనం చేసుకోవడం వెనుక ఎలాంటి రాజకీయ శక్తులు ప్రేరణ లేదని కూడా స్పష్టం చేశారు.  శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నవారే ఇటువంటి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. కాగా, కనకదుర్గ సోదరుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ.. అయ్యప్ప భక్తులకు, హిందూ సమాజానికి ఆమె క్షమాపణ చెప్పనంతవరకు ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చేది లేదని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ayyapa  Bindhu  Kanaka Durga  lord ayyapa  Perinthalmanna shelter home  Sabarimala  supreme court  politics  

Other Articles