Nitin Gadkari will lead next government: Sanjay Raut ప్రధాని మోడీని టార్గెట్ చేసిన శివసేన..

We will support nda if nitin gadkari will lead next government shiv sena

Shiv Sena, Sanjay Raut, Nitin Gadkari, BJP, 2019 Lok Sabha elections, Mahagathbandhan, BJP-ShivSena, Narendra Modi, Uddhav Thackeray, Social media, Politics

Shiv Sena's Rajya Sabha MP Sanjay Raut made some startling claims. None of the parties will get a clear majority in the coming Lok Sabha elections and there will be a hung Lok Sabha, Nitin Gadkari will be ready to lead the next government said Raut.

ప్రధాని మోడీని టార్గెట్ చేసిన శివసేన.. యూపీ, బీహార్ లలో పోటీ..

Posted: 01/23/2019 10:31 AM IST
We will support nda if nitin gadkari will lead next government shiv sena

కేంద్రంలోని నరేంద్రమోడీకి ప్రధాన మంత్రి పదవి మరికొన్ని నెలలకు మాత్రమే పరిమితం కానుందా.? అంటే అంటే ఔననే సమాధానం చెబుతుంది ఎన్డీఏలోని మిత్రపక్ష పార్టీ శివసేన. రానున్న సార్వత్రిక ఎన్నికల తరువాత ఏ పార్టీకీ మెజారిటీ రాదని, ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వాలు మళ్లీ తెరపైకి వస్తాయని శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు. అంతేకాదు ఎన్నికలకు రామారమి మరో మూడు నెలల సమయం వున్న నేపథ్యంలో అధికార బీజేపీకి మిత్రపక్షం శివసేన షాక్ ఇచ్చింది.

బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఉంటే ఎన్డీయేలో తాము భాగస్వామ్యం కాబోమని తేల్చిచెప్పిన శివసేన ప్రధానిగా మోడీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఒకవేళ మోదీకి బదులుగా ఆరెస్సెస్ మూలాలు ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతు ఇస్తామని తెలిపింది. మోడీ నేతృత్వంలోని బీజేపీ కేవలం తన గురించే ఆలోచిస్తుందని విమర్శించారు. అందువల్లే తమ దారి తాము చూసుకుంటున్నామని వ్యాఖ్యానించారు.

రానున్న ఎన్నికలలో తాము బీజేపితో కలసి పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కూడా చెప్పారు. శివసేన నిఘంటువులో పోత్తు అన్న పదానికి అర్థమే లేదని కూడా స్పష్టీకరించారు. ఇక కాంగ్రెస్ మహాకూటమిపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ లేకుండా ఎన్ని విపక్షాలు కలసినా అది సాధ్యపడదని కుండబద్దలు కొట్టారు. ఇక తమ పార్టీ కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపికి పలు రాష్ట్రాల్లో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యిందని సంజయ్ రౌత్ చెప్పారు.

రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని 25 స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థులను నిలుపుతుందని చెప్పారు. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ లోని భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాస్ రాజ్ భర్ తో కూడా తాము చర్చలు సాగించినట్లు చెప్పారు. యోగీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న రాజ్ భర్ గత కొంతకాలంగా విమర్శలను కూడా సంధిస్తున్నారన్న విషయాన్ని కూడా చెప్పుకోచ్చారు. యూపీ తో పాటు బీహార్, జమ్మూకాశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో తమ అభ్యర్థులు లోక్ సభ ఎన్నికల భరిలో నిలుస్తారని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv Sena  Sanjay Raut  Nitin Gadkari  Mahagathbandhan  Narendra Modi  Uddhav Thackeray  Politics  

Other Articles