Eclipse watchers howl at Blood Wolf Moon ఎర్రని చంద్రుడి వీక్షణం.. గ్రహణ ప్రభావం ఏయే రాశులపైన.?

Unique lunar eclipse thrills onlookers with vibrant red moon

lunar eclipse, blood moon 2019, lunar eclipse tonight, super blood wolf moon, blood moon, eclipse january 2019, eclipse, moon eclipse 2019, blood moon january 2019, Chandra Grahana, Chandra Grahan 2019 Effects

Astronomy buffs got a special treat Sunday as a combined lunar eclipse, blood moon and supermoon added a red glow to the night sky. Photographers around the world took to social media to share their snapshots under the hashtag #SuperBloodWolfMoon.

ఎర్రని చంద్రుడి వీక్షణం.. గ్రహణ ప్రభావం ఏయే రాశులపైన.?

Posted: 01/21/2019 03:45 PM IST
Unique lunar eclipse thrills onlookers with vibrant red moon

భారత కాలమానం ప్రకారం ఇవాళ సంభవించిన సంపూర్ణ చంద్రగ్రహణం పాశ్చ్యాత దేశాల ప్రజలకు కనువిందు చేసింది. సూపర్ బ్లడ్ మూన్ అనిదీనిని నామకరణం చేయడంతో యావత్ ప్రపంచమంతా ఆసక్తిగా గ్రహన పట్టు, విడుపులను తిలకించారు. అయితే సంపూర్ణ చందగ్రహణం సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపించడంతో దీనికి బ్లాడ్ మూన్ అని నామకరణం చేయడం.. సరిగ్గా గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపించడంతో దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల ప్రజలు తమ కెమెరాలకు పనిచెప్పి.. తరువాత తాము తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు.

జనవరి 21న ఉదయం 8.06 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.18 గంటలతో ముగిసింది. ఉదయం 10.42 గంటలకు చంద్రగ్రహణం అత్యధిక స్థాయిలో కనిపిస్తుంది. మొత్తం గ్రహణ కాల సమయం 5 గంటల 9 నిమిషాల 28 సెకెన్లు. ఇక సంపూర్ణ చంద్రగ్రహణం ఉదయం 10 గంటల 11 నిమిషాల 17 సెకెన్లకు మొదలై 11 గంటల 13 నిమిషాల 15 సెకెన్లతో మొత్తంగా 61 నిమిషాల 17 సెకెన్ల పాటు వుంది. పుష్య మాసంలో శుక్లపక్ష పౌర్ణమి సోమవారం ఏర్పడుతోన్న ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం భారత దేశంలో కనిపించడం లేదు. దీనిని సూపర్ బ్లడ్ మూన్ అని ప్రచారం చేయడంతో దీనిని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ చంద్ర గ్రహణాన్ని రాహు గ్రస్త చంద్ర గ్రహణం అని పండితులు పేర్కొంటున్నారు. గ్రహణం అనగానే చాలా మంది భయపడతారు. ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? గ్రహణ నియమాలు పాటించాలా? గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలా? అనే సందేహాలు కలుగుతాయి. ప్రస్తుతం ఏర్పడుతోన్న చంద్ర గ్రహణం పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. అయితే సంపూర్ణ చంద్ర గ్రహణ ప్రభావం భారత్ లో ఉండదు కాబట్టి, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

భారత దేశంలో కనిపించకపోయిన చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపుతాడు.. కాబట్టి మానసిక ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే పరిహారం చేయాలని కూడా పండితులు చెబుతున్నారు. అయితే గ్రహణ పట్టు, విడుపు స్నానం చేయాల్సిన అవసరం లేదు. గర్భవతులు కూడా కదలకుండా కూర్చోవాలనే నియమాలు పాటించాల్సిన పనిలేదు కర్కాటక రాశిలో గ్రహణం ఏర్పడుతుంది.. కాబట్టి కర్కాటకంతోపాటు ఆ రాశికి ముందు వెనుక ఉండే మిథున, సింహా రాశుల వారు శివాలయంలో అభిషేకాలు చేయించడమే పరిహారం అని పండితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lunar eclipse  blood moon 2019  Chandra Grahana  Chandra Grahan 2019 Effects  

Other Articles