Srinivas Reddy is new Telangana Speaker స్పీకర్ బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాస రెడ్డి

Pocharam srinivas reddy is new telangana assembly speaker

Speaker, Pocharam Srinivas reddy, Mumtaz Ahmed Khan, CM KCR, Uttam Kumar Reddy, E. Rajender. Ahmed Balala, telangana assembly, telangana Politics, TRS working President, KTR, telangana

Pocharam Srinivas Reddy was unanimously elected the Speaker of the Telangana Legislative Assembly. Pro-tem Speaker Mumtaz Ahmed Khan announced Srinivas Reddy's unanimous election.

బాధ్యతలు చేపట్టిన పోచారం.. లక్ష్మీపుత్రుడంటూ కేసీఆర్ కితాబు

Posted: 01/18/2019 11:51 AM IST
Pocharam srinivas reddy is new telangana assembly speaker

తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఆయన అధికారికంగా అసెంబ్లీలో పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే, ప్రోటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఆయన ఎన్నిక ఏకగీవ్రంగా జరిగిందని పేర్కోంటూ స్పీకర్ పోచారం శ్రినివాసరెడ్డిన అభినందనలు తెలిపారు. ఆ తరువాత బాధ్యతలు చేపట్టాల్సిందిగా అహ్వానించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఎంఐఎం ఉపసభాపతి సభ్యులు ఆయన వెంటరాగా, ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోని బాధ్యతలను అందుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తనకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పెద్దన్న వంటివాడని, ఆయనకు తాను లక్ష్మీ పుత్రుడని ముద్దుగా పేరు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోచారం మాదిరిగానే, తాను కూడా సింగిల్ విండో సభ్యుడిగా పనిచేసి, ఆపై ఎమ్మెల్యేను అయ్యానని గుర్తు చేసుకున్నారు. గతంలో ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని తాజాగా అందిన స్పీకర్ పదవిని కూడా అదే విధంగా దిగ్విజయంగా నిర్వహిస్తారని కేసీఆర్ అకాంక్షించారు.

గత అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే, ఐక్యరాజ్యసమితి సహా, ప్రపంచమంతా గుర్తించిన 'రైతుబంధు' పథకాన్ని అమలు చేశామని అన్నారు. రైతుబంధు పథకం ఎన్నో రాష్ట్రాల్లో స్ఫూర్తిని నింపిందని, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఇదే పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారని చెప్పారు. ఎన్నో మంచి కార్యక్రమాలను, మంచి ఫలితాలను ఆయన తెచ్చారని, ఆయన స్పీకర్ గానూ విజయవంతం అవుతారన్న అభిలాషించారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాసరెడ్డి ఇంటిపేరు పోచారం కాదని, ఆయన ఇంటిపేరు పరిగె అని కేసీఆర్ అన్నారు. స్వగ్రామం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప వ్యక్తి ఆయనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. "ఈ రోజు ఉదయం పేపర్లు తిరగేస్తున్నప్పుడు 'స్పీకర్ గా పోచారం' అని అన్ని పేపర్లూ రాసినయ్ అధ్యక్షా. తమరి ఇంటిపేరు పోచారం కాదు అధ్యక్షా. తమరి ఇంటిపేరు పరిగె. కానీ, తమరు పోచారం శ్రీనివాసరెడ్డిగానే గుర్తింపును సాధించారని... దీంతో పోచారం గ్రామస్థులు ధన్యులయ్యారని కేసీఆర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles