Two held in Hyderabad Metro Rail job fraud మెట్రోలో ఉద్యోగాలంటూ.. రూ.80 లక్షల మేర కుచ్చుటోపి

Fake hyderabad metro job offer dupes 161 people two arrested

HMR jobs, seized cash, cheating the unemployed youth, Uppal police, telangana, Hyderabad Metro Rail, Hyderabad Metro, High Court Advocate, Mission Bhageeratha DE, V Ramakrsihna, G Sridhar Reddy, C Mahalakshmi, B Laxman Rao, crime

The Uppal Police in Hyderabad arrested two people for allegedly duping 161 people including several unemployed youth under the guise of providing jobs in the Hyderabad Metro Rail Limited (HMRL).

మెట్రోలో ఉద్యోగాలంటూ.. రూ.80 లక్షల మేర కుచ్చుటోపి

Posted: 01/18/2019 11:15 AM IST
Fake hyderabad metro job offer dupes 161 people two arrested

హైదరాబాద్ మెట్రో రైలులో ఉద్యోగాల పేరుతో ఏడాది కాలంగా ఆశలు కల్పిస్తూ.. లక్షల రూపాయలను వసూలు చేసి నిరుద్యోగ యువత నెత్తిన శఠగోపం పెట్టిన ముఠా వ్యవహారం గుట్టు రట్టు అయింది. హైకోర్టుకు చెందిన న్యాయవాది, మిషన్ భగీరధలోని డిఫ్యూటీ ఇంజనీర్ తో కలసి ప్రథాన సూత్రధారి మొత్తం వ్యవహారాన్ని ఏడాది కాలంగా నడిపిస్తూ.. 161 మంది నిరుద్యోగుల నెత్తిన కుచ్చుటోపి పెట్టి.. రమారమి రూ.80లక్షల రూపాయలను వసూలు చేశారు. ఇక ఈ ముఠాలోని ప్రధాన సూత్రధారికి ఓ మహిళ సాయంతో చేయడంతో అమెకు ఏకంగా ఇంటినే నిర్మించాడు.

వీరి మాయమాటలను విశ్వసించి డబ్బును సమర్పించిన ఓ బాధితురాలు ఏడాది అవుతున్నా ఇంకా ఉద్యోగం రాకపోవడంతో.. అమె ఏకంగా హైదరాబాద్ మెట్రో రైలు అధికారులను కలసింది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు.. కనీసం తాను చెల్లించిన డబ్బునైనా ఇప్పించాలని నేరుగా ఉప్పల్ పోలీసుల ఆశ్రయించడంతో నిందితుల గుట్టురట్టైంది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు అతనికి సాయం చేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా న్యాయవాది సహా మిషన్ భగీరధ ఢిఈలు పరారీలో వున్నారు.

నిందితులను విచారించిన అనంతరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన వెలగపూడి రామకృష్ణ హైదరాబాద్ లోని అమీర్ పేటలో స్థిరపడ్డాడు. పలు సంస్థల్లో పీఆర్ఓగా పనిచేసిన ఆయన మెట్రోలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతకు గాలం వేశాడు. అయనకు నిజామాబాద్ కు చెందిన చిల్ల మహాలక్ష్మి పూర్తిగా సహకరించింది. అమెతో పాటు ఎస్సార్ నగర్ కు చెందిన హైకోర్టు న్యాయవాది గడ్డం శ్రీధర్‌రెడ్డి, మంచిర్యాలకు చెందిన ఇంజనీర్ బండారు లక్ష్మణరావులు కూడా తోడు కావడంతో వీరంతా ఓ ముఠాగా ఏర్పడ్డారు.

ప్రధాన సూత్రధారి రామకృష్ణ ఈ సొమ్ములో రూ. 23 లక్షలు ఖర్చు చేసి నిజామాబాద్లోని ఫతేనగర్ లో మహాలక్ష్మికి ఇల్లు కట్టించాడు. ముఠాలోని మిగతా ఇద్దరు సభ్యులు శ్రీధర్ రెడ్డి, లక్ష్మణరావులకు చెరో పది శాతం వాటా ఇచ్చాడు. దీంతో కొత్త దారులు వెతికిన నిందితుడు రామకృష్ణ ఎల్ అండ్ టీ వైస్ ప్రెసిడెంట్ పి.రాధికారెడ్డి పేరుతో నకిలీ నియామక ఉత్తర్వులను సృష్టించి నమ్మించాలని చూశాడు. ఇలా ఓ బాధితురాలు తాను పోందిన అపాయింట్‌మెంట్ లెటర్ తో మెట్రో అధికారులను కలవడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

మోసపోయిన ఆమె ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామకృష్ణ, మహాలక్ష్మిలను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీధర్‌రెడ్డి, లక్ష్మణరావు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, రూ. 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై సెక్షన్ 420, 468, 471, 120బి కింద కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Metro Rail  HMR jobs  unemployed youth  Uppal police  telangana  crime  

Other Articles