Banks lost Rs 41,167 crore to fraud in 2017-18 బ్యాంకు కుంభకోణాల విలువ ఎంతో తెలుసా.?

Bank frauds rise over 72 to rs 41 167 crore in 2017 18 says rbi report

rbi, reserve bank of india, bank fraud, bank fraud data, bank fraud data rbi, rbi bank fraud, fraudsters data rbi, rbi data on bank frauds, ,pnb fraud,nirav modi, 2018 bank fraud cases

Fraudsters have looted Rs 41,167.7 crore from the banking system in 2017-18, a sharp jump of 72 per cent from Rs 23,933 crore the previous year, despite “stringent monitoring and vigilance”, according to data released by the RBI.

బ్యాంకు కుంభకోణాల విలువ ఎంతో తెలుసా.?

Posted: 12/31/2018 06:43 PM IST
Bank frauds rise over 72 to rs 41 167 crore in 2017 18 says rbi report

2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ ఎంత.? నోట్ల రద్దు తరువాత కొన్ని నెలల పాటు పుష్కలమైన నిధులతో కళకళలాడిన బ్యాంకులు ఆ తరువాత దివాళాతీసాయి. ఈ ఏడాది ఆరంభంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ (పీఎన్బీ)‌ లో వెలుగుచూసిన కుంభకోణం యావత్‌ బ్యాంకింగ్‌ రంగంలోనే సంచలనం సృష్టించింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన బంధువు మెహుల్‌ ఛోక్సీ తదితరులు కలిసి పీఎన్బీకి రూ. 13వేల కోట్ల మేర కుచ్చుటోపి పెట్టారు.

మొత్తంగా బ్యాంకుల్లో కుంభకోణాలు జరిగిన మోసాల విలువ ఎంత తెలుసా..? అక్షరాలా రూ. 41,167.7కోట్లు. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్బీఐ) తాజా గణాంకాలు వెల్లడించాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో మోసాలు 72శాతం పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 23,933కోట్ల మేర బ్యాంకులు మోసపోగా.. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 41,167.7కోట్లకు పెరిగింది.

పీఎన్బీ కుంభకోణం వల్లే మోసాలు విలువ అమాంతం పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రంగంలో 5,076 మోసం కేసులు నమోదవగా.. గత ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 5,917కు పెరిగింది. కాగా.. మొత్తం నమోదైన మోసాల్లో 80శాతం రూ. 50కోట్లు అంతకంటే పైబడినవే. ఇక 93శాతం కేసుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే మోసపోయినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reserve bank of india  bank fraud  RBI data  fraudsters  pnb fraud  nirav modi  

Other Articles