Mamata Banerjee govt new year gift to farmers రైతులకు మమతా సర్కార్ న్యూఇయర్ గిప్ట్..

Mamata banerjee announces life insurance financial aid for farmers

West bengal, Telangana, rythu bhima, rythu bandhu, Mamata Banerjee, kcr, farmers, crop insurance, crop investment, farmers insurannce

West Bengal chief minister Mamata Banerjee has announced new year gift to farmers. Banerjee said that the state has launched a crop insurance programme in which premium will be paid by the government.

మరో అడుగు ముందుకేసీ రైతులకు మమతా సర్కార్ న్యూఇయర్ గిప్ట్..

Posted: 12/31/2018 06:01 PM IST
Mamata banerjee announces life insurance financial aid for farmers

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న తరుణంలో ఈ పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకోస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నుంచి ప్రశంసలు అందుకున్న ఈ పథకాలను అమలు చేస్తామని ఇప్పటికే ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలు హామీని ఇచ్చాయి. కాగా, దేశానికి అన్నం పెట్టే రైతన్నల విషయంలో మరో అడుగు ముందుకేసీన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. రైతుల కోసం మూడు పథకాలను ప్రవేశపెట్టనుంది.

తాజాగా తమ రాష్ట్రంలోనూ రైతుబంధు, రైతుబీమా తరహా పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో అడుగు ముందుకేసీ పంటభీమా పథకాన్ని కూడా రైతులకు వర్తింపజేయనుంది. ఈ లాభం కూడా రైతులకు అందించనున్న ప్రభుత్వం.. అందుకయ్యే ప్రీమియం మొత్తాన్ని భరించనున్నట్లు మమతా బెనర్జీ సర్కార్ ప్రకటించింది.

పంట పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి ఏడాదికి రూ. 5 వేల చొప్పున అందిస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. దీంతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రకటించారు. ఎవరైనా రైతు మరణిస్తే.. అతడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని మమత తెలిపారు. ఈ ప్రీమియాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె పేర్కొన్నారు.


18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న రైతులందరకీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికే ఒడిశా, జార్ఖండ్ రాష్ర్టాలు రైతుబంధు తరహా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ర్టాల సరసన తాజాగా పశ్చిమ బెంగాల్ కూడా చేరింది. మరోవైపు.. మోదీ సర్కారు కూడా రైతు బీమా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అన్నదాతకు అండగా నిలవాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకం దేశానికే దిక్సూచీలా మారింది. తెలంగాణలో ఈ పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ. 8 వేల పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ. 10 వేలకు పెంచారు. వచ్చే సీజన్ నుంచి రైతులకు రూ. 10 వేల పెట్టుబడి సాయం ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటీవలి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mamata Banerjee  farmers  crop insurance  crop investment  farmers insurance  west bengal  

Other Articles