Rats 'drank' 1000L of alcohol in Bareilly తాగుబోతు ఎలుకలు.. 1000 లీటర్ల మద్యాన్ని తాగేశాయి..

Uttar pradesh rats drank 1000l of alcohol in bareilly

rats drink liquor, uttar pradesh, rats, rats alcohol, alcoholic rats, bareilly, rats drink alcohol, rats drink alcohol in bihar,rats bihar,rats uttar pradesh,liquor-loving rats,rats drink illegal liquor,rats alcohol bareilly,Abhinandan Singh,rats drink banned liquor

UP as police claim that recently a 'gang of rats' drank almost 1,000 liters of alcohol stacked in the storeroom of the police station.

తాగుబోతు ఎలుకలు.. 1000 లీటర్ల మద్యాన్ని తాగేశాయి..

Posted: 12/29/2018 06:37 PM IST
Uttar pradesh rats drank 1000l of alcohol in bareilly

బీహార్ లో గతేడాది తాము సీజ్ చేసిన 9 లక్షల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగిశాయని పోలీసులు చెప్పిన కథనాలు ఔరా.. అనిపించి ఆ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా, ఉత్తర్‌ప్రదేశ్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ గ్యాంగ్ లా ఏర్పడిన ఎలుకలు దొరికిన మద్యాన్ని దొరికినట్టే తాగేస్తున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులే వెల్లడించారు. ఈ తాగుబోతు ఎలుకల తీరు ఇప్పుడు ఏకంగా పోలీసుల మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే... రాయబరేలీ ప్రాంతంలో ఇటీవల అక్రమ మద్యం భారీగా పట్టుబడింది. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోలీస్ స్టేషన్‌లోని ఓ గదిలో పెట్టి తాళం వేశారు. అయితే, బుధవారం ఈ మద్యం నిల్వలను పరిశీలించేందుకు పోలీస్ స్టేషన్ హెడ్ క్లర్క్ నరేశ్ పాల్ గది తలుపులు తెరిచాడు. అనంతరం, లోపలికి వెళ్లి చూడగా ఆ క్యాన్లలో చుక్క మద్యం కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయింది. ఖాళీగా కనిపిస్తోన్న ఆ క్యాన్లకు రంధ్రాలు ఉన్నాయి. ఆ గదిలో ఎలుకలు పరుగులు పెడుతుండడంతో ఇదంతా వాటి పనేనని పోలీసులు నిర్దరించారు.

మొత్తం 1,000 లీటర్ల మద్యాన్ని ఎలుకల గుంపు తాగేసిందని ఎస్పీ అభినందన్ సింగ్ తెలియజేశారు. ఆ ఎలుకలను తప్పకుండా పట్టుకుంటామని, భవిష్యత్తులో అవి స్టోర్ రూంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఘటనపై విచారణకు ఆదేశించనున్నట్టు తెలిపారు. వాస్తవానికి స్వాధీనం చేసుకున్న మద్యం నమూనాలు, చట్టపరమైన ప్రొసీడింగ్స్ కోసం కొంత మొత్తంలో సేకరించి మిగతా దానిని ధ్వంసం చేయాలి. అలా కాకుండా మొత్తం 1,000 లీటర్ల మద్యాన్ని సీజ్‌చేసి పోలీస్ స్టేషన్‌లో దాచడం, తర్వాత దానిని ‘ఎలుకలు’ తాగేయడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

తాము స్వాధీనం చేసుకుని, గోడౌన్లలో భద్రపరిచిన 9 లక్షల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయని బీహార్ పోలీసులు గతేడాది ప్రకటించారు. మద్యం నిల్వచేసిన క్యాన్లను ఎలుకలు ధ్వంసంచేసి తాగేశాయన్నారు. కానీ, ఈ వ్యవహారంలో అనుమానం వ్యక్తం చేస్తూ కొంతమంది పోలీసులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు కూడా నిర్వహించారు. గర్బంతో ఉన్నప్పుడు ఎలుకలు మద్యం తాగితే, వాటికి పుట్టే పిల్లలు తాగుబోతుగా మారుతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. పరిశోధకులు వీటికి నీరు, మద్యం అందజేస్తే అవి మద్యాన్నే తీసుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rats  liquor  bareilly  siezed alcohol  abhinandan singh  bihar  uttar pradesh  crime  

Other Articles