Share Profits With Locals: Uttarakhand HC to Baba Ramdev బాబా రాందేవ్ దివ్య కంపెనీకి ఎదురుదెబ్బ..

Uttarakhand hc orders ramdev company to share profits with locals

Baba Ramdev, Biodiversity Act, Divya Pharmacy, Fair and Equitable Benefit Sharing, Justice Sudhanshu Dhulia, Local Communities, Section 7 of the Biodiversity Act, Uttarakhand Biodiversity Board, Uttarakhand High Court

The Uttarakhand High Court has directed Divya Pharmacy, owned by Baba Ramdev and Acharya Balkrishna, to share its profits with local and indigenous communities.

బాబా రాందేవ్ దివ్య కంపెనీకి ఎదురుదెబ్బ..

Posted: 12/29/2018 03:03 PM IST
Uttarakhand hc orders ramdev company to share profits with locals

యోగా గురు రాందేవ్ కు చెందిన దివ్య ఫార్మసీ సంస్థకు ఉత్తరాఖండ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సదరు దివ్య ఫార్మసీ సంస్థ అర్జించిన లాభాలలో స్థానిక రైతులు మరియు రైతు సంఘాలతో లాభాలను పంచుకోవాలని ఆదేశించింది. బాబా రాందేవ్ ఫార్మసీ సంస్థ రైతుల నుంచి ఔషదతత్వాలు వున్న మొక్కలను తీసుకుని దానిని వ్యాపారంగా నిర్వహించిన లాభాలను అర్జించిన క్రమంలో న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. బయోలాజికల్ డైవర్సిటీలో పొందుపర్చిన చట్టాల ప్రకారం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

అయితే ఈ ప్రతిపాదన ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డు నిబంధనలకు విరుద్ధమని బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న దివ్య ఫార్మసీ కోర్టులో వాదించింది. బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం కేవలం విదేశీ కంపెనీలు రైతుల నుంచి ఔషదీయ మొక్కలను కొనుగోలు చేస్తే మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని వాదనను వినిపించింది. అయితే బయోలాజికల్ డైవర్సిటీ చట్టరం ప్రకారం ఏదేని సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసే ఔషదీయ మొక్కలను వాణిజ్యపరంగా వాడినా చట్టం వర్తిస్తుందని ఉత్తరాఖండ్ కోర్టు స్పష్టం చేసింది.

ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో జీవ వనరులు ప్రధాన పదార్ధం మరియు ముడి పదార్ధాలను కలిగి ఉన్నాయని జస్టిస్ సుధాన్షు ధూలియా బెంచ్ స్పష్టం చేసింది. మొత్తం రూ. 421 కోట్ల కంపెనీ లాభంలో రెండు కోట్లను స్థానికులతో కలిసి పంచుకోవాలని ఆదేశించింది. గతంలోనే ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డు ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉత్తరాఖండ్ బయోడైవర్సిటీ బోర్డుకు ఇందుకు సంబంధించిన అధికారులు లేవని ఫార్మసీ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ అంశంలో అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు తెలిపింది. ఉత్తరాఖండ్ బయోలాజికల్ బోర్డుకు ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసే హక్కు ఉందని హైకోర్టు వెల్లడించింది. జీవ వనరులు దేశ సంపదతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే వారి సంపద కూడా అని తెలిపింది. దీనిపై వారికి హక్కు ఉంటుందని తెలిపింది. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో అయుర్వేద, ఔషదీయ మొక్కలు పెంచుతున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఉత్పత్తులను స్థానిక వైద్యులతో పాటు హకీంలకు మాత్రం న్యాయస్థానం మినహాయింపు కల్పించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ramdev  Biodiversity Act  Divya Pharmacy  Locals  Uttarakhand High Court  

Other Articles