AP school loses recognition for parading students nude విద్యార్థులతో ప్రైవేటు పాఠశాల వికృత చేష్టలు..

Class 3 students stripped naked by teacher for coming late to school

Chaitanya Bharati English medium school, Chittoor District, DEO K Panduranga Swamy, Chittoor DEO, Chaitanya Bharati school punishment, Student made to stand naked, Child rights, POCSO Act, POCSO (Protection of Children from Sexual Offences), POCSO cases

A school in Andhra Pradesh is making headlines after a video revealed five students standing naked under the scorching Sun, for being late to school. The horrifying incident took place at Punganur in Chittoor district.

విద్యార్థులతో ప్రైవేటు పాఠశాల వికృత చేష్టలు..

Posted: 12/27/2018 02:58 PM IST
Class 3 students stripped naked by teacher for coming late to school

పాఠశాల విద్యార్థులను కొట్టినా, మందలించినా అది నేరమేనన్న చట్టం రావడంతో ఉపాధ్యాయులు వారిని బెత్తం పట్టకుండానే పరువు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల పట్ల పాఠశాల యాజమాన్యాలు అత్యంత పైశాచికంగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని కొందరినీ, హోం వర్క్ చేయలేదని మరికొందరు విద్యార్థులను ప్రవైటు పాఠశాల యాజమాన్యం నగ్నంగా ఎండలో నిలబెట్టిన వికృత చేష్టలు బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా పుంగనూరులోని నానసాహెబ్ పేటలోని చైతన్య భారతి ఇంగ్లీషు మీడియం ప్రైవేటు స్కూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల, వారి లేత మనస్సు, మెదడుపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్న విషయాన్ని మర్చిపోయిన యాజమాన్యం వారిపై పైశాచికంగా వ్యవహరించింది. స్కూల్ కు ఆలస్యంగా వచ్చారనే కారణంగా... ఐదుగురు విద్యార్థులను కొన్ని గంటల పాటు ఎండలో నగ్నంగా నిలబెట్టింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును నమోదు చేని.. పాఠశాల కరస్పాండెంట్‌ నాగరాజ నాయుడును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిబందనలకు విరుద్దంగా వ్యవహరించి.. విద్యార్థులను అవమానపర్చటంతో.. విద్యాశాఖ అధికారులు కూడా స్పందించారు. డీఈవో, ఆర్‌జేడీ ఆదేశాలతో చైతన్య భారతి పాఠశాల గుర్తింపును రద్దు చేసినట్లు ఎంఈవో లీలారాణి తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థుల నుంచి వివరాలు సేకరించామని, దీనిపై జిల్లా విద్యాశాఖాధికారికి నివేదికను అందజేస్తామని ఎంఈవో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chaitanya Bharati school  POSCO act  nanasahed peta  Punganur  Chittoor district  

Other Articles