VVPAT slips go ‘missing’ in Jubilee Hills తెలంగాణ ఎన్నికలలో వీవీఫ్యాట్ అక్రమాలు జరిగాయా?

Vvpat slips go missing in jubilee hills congress demands re poll

election commission, VVPAT Machines, VVPAT Machines, Telangana assembly elections, Jubilee Hills Constituency, VishnuVardhan Reddy, Dana Kishore, GHMC commissioner, EVMs Tampering, Telangana politics

The empty VVPATs came to light when the representatives of the Congress party came to GHMC warehouse at Chudi Bazar to observe the sealing of strong rooms.

తెలంగాణ ఎన్నికలలో వీవీఫ్యాట్ అక్రమాలు జరిగాయా?

Posted: 12/27/2018 03:38 PM IST
Vvpat slips go missing in jubilee hills congress demands re poll

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అధికర దుర్వినియోగం, ధనప్రభావం విరివిగా వాడి మరోమారు పగ్గాలు చేపట్టిందన్న అరోపణలు పక్షం రోజులు దాటినా ఇంకా వింటూనే వున్నాం. ఇక మరికొందరు కాంగ్రెస్ నేతలు, విపక్ష నేతలు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఈసీ అధికారులతో కుమ్మకై, ఈవీఎంలు ట్యాంపరింగ్ తోనే కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రి పగ్గాలను అందుకున్నారని కూడా ఆరోపణలు చేస్తూనే వున్నారు.

ఇక తాజాగా అ అరోపణలకు బలం చేకూరుస్తూ జరిగిన ఓ సంఘటన కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వీవీప్యాట్ స్లిప్పులు బయటకు రావడంతో అందుకు కారణం. ఎన్నికల అధికారి రాజాగౌడ్‌ లెక్కింపు ముసిగిన వెంటనే ఆ స్లిప్పుల్ని వేరే కవర్లలో దాచారని బయటపడటంతో కాంగ్రెస్ నేతలు చుడీబజార్ లోని గోడౌన్ దగ్గర ఆందోళన చేశారు. ఎన్నికల ప్రక్రియ, టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు అన్నీ అక్రమంగానే జరిగాయని వాళ్లు ఆరోపించారు. దీనిపై చట్టపరంగా తేల్చుకుంటామని తెలిపారు.

ఎన్నికల సంఘం అధికారుల నిబందనల ప్రకారం ప్రకారం వీవీప్యాట్‌ పెట్టెల్లోని స్లిప్పుల్ని లెక్కింపు జరిగిన 45 రోజుల వరకూ బయటకు తియ్యకూడదు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల అధికారి ఈనెల 11న ఓట్ల లెక్కింపు అయిపోగానే 306 పోలింగ్‌ కేంద్రాల వీవీప్యాట్లను తెరిచి వాటిలో స్లిప్పుల్ని బయటకు తీసి కవర్లలో వేశారు. కవర్లకు సీల్ వేసి... ట్రంక్ పెట్టెలో పెట్టారు. అయితే దీనిపై జిల్లా ఎన్నికల అధికారులకు కూడా సమాచారం అందించలేదు. దీంతో ఈ అంశం కలకలం రేపుతుంది.

హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 15 నియోజక వర్గాల ఈవీఎంలు, వీవీప్యాట్‌లను చుడీబజార్లోని గోడౌన్ లో భద్రపర్చి, ప్రధాన రాజకీయ పార్టీల నేతల సమక్షంలో సీల్ వెయ్యాలని దానకిశోర్‌ నిర్ణయించారు. ఇందుకోసం గోడౌన్ దగ్గరకు రాజకీయ నేతలు వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ కు సంబంధించిన వీవీప్యాట్ లు తెరచి ఉండటం, వాటిలో స్లిప్పులు లేకపోవడం వాళ్లను ఆశ్చర్యపరిచింది. దీంతో అక్కడే ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలతో ఎన్నికల అధికారి దానకిశోర్‌ మాట్లాడారు. ఈ వ్యవహారంపై తాను న్యాయపోరాటం చేస్తానని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles