Indigenous Train 18 now fastest in India అత్యంత వేగవంతమైన రైలు ట్రైన్ 18.. విశేషాలు..

Train 18 officially india s fastest train says piyush goyal

Train 18, Piyush Goyal, railways minister Piyush Goyal, Shatabdi Express, India's fastest train, fastest train, Indian Railways, trial run

Train 18, India’s first indigenously built engine-less train, has officially become the country’s fastest hurtling at a speed of 180 kilometres per hour during a trial run.

ITEMVIDEOS: అత్యంత వేగవంతమైన రైలు ట్రైన్ 18.. విశేషాలు..

Posted: 12/27/2018 12:46 PM IST
Train 18 officially india s fastest train says piyush goyal

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ట్రైన్ 18 ఈ నెల 29వతేదీన అధికారికంగా తన సేవలను అందించనుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం వారణాసి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీదుగా ఢిల్లీకి నడిపే ఈ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 29న పచ్చజెండా ఊపి లాంఛనంగా ఈ రైలును ప్రారంభించనున్నారు. ఇంజన్ లేకుండా పూర్తిగా ఎయిర్ కండీషన్డ్ బోగీలతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందకోట్ల రూపాయల వ్యయంతో తయారైన ఈ రైలుకు ట్రైన్ 18 గా నామకరణం చేశారు.

అత్యంత వేగంగా నడిచే ఈ రైలు నుంచి ప్రయాణికులు సులభంగా దిగేందుకు వీలుగా తలుపుల వద్ద సైడ్స్ కూడా ఏర్పాటు చేశారు. వైఫైతోపాటు జీపీఎస్ బేస్‌డ్ ప్యాసింజర్ ఇన్ ఫర్ మేషన్ సిస్టమ్, టచ్ ఫ్రీ బయో వాక్యూమ్ టాయ్ లెట్స్, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, ఉష్ణోగ్రతను నిరోధించే సిస్టమ్ ఈ రైలు ప్రత్యేకతలు. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ బోగీల్లో 52 సీట్లు ఏర్పాటు చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలుగా దీనికి గుర్తింపు లభించనుందని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

ఈ మేరకు రైలు ట్రయల్ రన్ సందర్భంగా తీసిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘నీడ్ ఫర్ స్పీడ్’’ అంటూ ట్వీట్ చేసిన మంత్రి.. ట్రైన్-18 గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు పేర్కొన్నారు. దేశంలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఇంజిన్ లేని రైలులో 16 ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఇప్పటి వరకు ఫాస్టెస్ట్ రైళ్లగా రికార్డులకెక్కిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వేగాన్ని ఇది అధిగమించనుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు వేగం గంటకు 155 కిలోమీటర్లు. ఈ రైలుతో పోలిస్తే ప్రయాణ వేగాన్ని 15 శాతం తగ్గిస్తుంది. న్యూఢిల్లీ-వారణాసి, హబీబ్‌గంజ్-న్యూఢిల్లీ, లక్నో-న్యూఢిల్లీ, న్యూఢిల్లీ-కల్కా, న్యూఢిల్లీ-అమృత్‌సర్, అహ్మదాబాద్-ముంబై రూట్లలో ఈ రైలు ప్రయాణించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Train 18  Piyush Goyal  Shatabdi Express  India's fastest train  Indian Railways  

Other Articles