Please Focus on Existing Trains: BJP Leader to PM Modi ప్రధాని, రైల్వేమంత్రులకు.. బీజేపి సీనియర్ నేత ఝలక్

Forget bullet train first run existing ones properly bjp leader laxmi kanta chawla

Bullet train, Indian railways, BJP leader, Laxmi Kanta Chawla, Narendra Modi, Punjab, Amritsar, Jaynagar, Saryu Yamuna Express, Piyush Goyal, existing train, welfare of passengers, pasengers problems, stations conditions

Senior BJP leader Laxmi Kanta Chawla’s angry video rant, attacking Narendra Modi and Railway Minister Piyush Goyal for the poor condition of Indian Railways is being shared widely on social media.

ITEMVIDEOS: ప్రధాని, రైల్వేమంత్రులకు.. బీజేపి సీనియర్ నేత ఝలక్

Posted: 12/27/2018 11:53 AM IST
Forget bullet train first run existing ones properly bjp leader laxmi kanta chawla

భారత్ లో జపాన్ దేశం సాంకేతికతతో గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి దేశ అర్థిక రాజధాని ముంబై వరకు అత్యంత వేగంగా నడిచే బుల్లెట్ రైళ్లు ప్రవేశ పెట్టేందుకు ఇప్పటికే కేంద్రం జపాన్ దేశానికి కాంట్రాక్టులు కూడా కట్టబెట్టిన తరుణంలో.. ప్రధాని మోదీకి సొంత పార్టీ మహిళా నేతే ఝలక్ ఇచ్చారు. బుల్లెట్ రైలు సంగతి దేవుడెరుగు.. ఇప్పుడున్న రైళ్లు సమయానికి నడిచేలా చూడాలంటూ సూచించారు. ప్రభుత్వ బడాయిలు పేపర్లకు, టీవీలకు మాత్రమే పరిమితం అవుతున్నాయన్న అమె.. వాస్తవికత మాత్రం అత్యంత దారుణ పరిస్థితులు వున్నాయని విమర్శించారు.
 
పంజాబ్ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ చావ్లా ప్రయాణించాల్సిన సరయూ ఎక్స్‌ప్రెస్ 9 గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆమె మాటలను ప్రయాణీకులలో ఒకరు వీడియో తీశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆమె ఏమన్నారంటే.. ‘‘మోదీ జీ.. బుల్లెట్‌ రైలును మర్చిపోండి. ఇప్పుడు నడుస్తున్న రైళ్లను సమయానికి నడపడంపై దృష్టి పెట్టండి’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

‘‘ధనవంతుల గురించి కాదు. సామాన్యుడి గురించి ఆలోచించండి. రైళ్లలో తలుపులు, కిటికీలు సరిగ్గా లేవు. క్యాటరింగ్ కూడా ఉండదు. నీళ్లు ఉండవు. బాత్రూములు సరిగ్గా లేవు. 24 గంటలు ఎలా ఉండగలుగుతాం. ఎప్పుడు వెళుతుంది.. ఎందుకు లేట్ అయ్యింది అనే విషయం మా కెవ్వవరికీ తెలియదు. ఫిర్యాదులపై పేపర్లలో, టీవీలలో గొప్పగా ప్రచారం చేస్తుంటారు. కానీ వాస్తవరూపంలో వాటిని పట్టించుకునేవాడే లేడు. ఇదంతా డంబాచారం మాత్రమే కానీ.. పనికి వచ్చేది కాదని కూడా అక్షేపించారు.

కేవలం శతాబ్ధి, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లను పట్టించుకున్నట్టే.. సామాన్యుల రైళ్లను పట్టించుకోండి. రైళ్లలో రిజర్వేషన్ పేరుతో ఎంత దోపిడో జరుగుతుందో తెలియదా.?’’ అంటూ రైల్వే పనితీరును ఎండగట్టారు. ‘‘దేశంలో డిప్లొమా, మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు కూలీ పనులు చేసుకుంటున్నారు. వారికి ఉపాధి చూపించలేకపోయారు. సామాన్యుడికి మంచిరోజులు రాలేదు. మోదీజీ, పియూష్ జీ సామాన్యుడి గోస వినండి. కళ్లకు, చెవులకు నాలుగు అంగుళాల దూరం కాదు.. నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles