AP High Court Will Function From Amravati తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు.. జనవరి నుంచే కార్యకలాపాలు..

Andhra pradesh high court to start functioning from amaravati

Andhra Pradesh High Court, Telangana High Court, Ramnath Kovind, Andhra Pradesh, Amaravati high court building, Amravati, Andhra Pradesh High Court, Telangana High court, Hyderabad, President, notification, state bifurfication

Andhra Pradesh will have a separate high court which will function from Amravati, the new capital of the state. ith the creation of the new high court, the country now has 25 high courts.

తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు.. జనవరి నుంచే కార్యకలాపాలు..

Posted: 12/27/2018 10:55 AM IST
Andhra pradesh high court to start functioning from amaravati

రాష్ట్ర పునర్విభజన జరిగి ఐదేళ్ల కావస్తున్నా.. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే హైకోర్టు విభజనను వేగవంతం చేయాలని తెలంగాణ ఎంపీలు ఎన్నో పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇన్నాళ్లకు వారి ప్రయత్నాలు, ప్రభుత్వ వినులపై స్పందించిన కేంద్రం.. రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాల నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులుగా విభజిస్తూ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రపతి.. ప్రస్తుతం హైదరాబాద్ లోని హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా సేవలందిస్తుందని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం, 2019  జనవరి 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా హైకోర్టులు పనిచేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16 మంది న్యాయమూర్తులను కేటాయించారు.

కాగా, మరోవైపు ఉద్యోగుల విభజన చర్యలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు పదిహేను వందల మంది వరకు ఉన్న ఆఫీస్ సబార్డినేట్లు, రికార్డు అసిస్టెంట్లు, బైండర్లు, జమేదార్లు, దఫేదార్లు, బుక్ బేరర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, మిషన్ ఆపరేటర్లు తదితరులను రెండు హైకోర్టులకు కేటాయించనున్నారు. ఆయా ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించడం కూడా పూర్తయినట్టు సమాచారం.

తెలంగాణ హైకోర్టుకు..

జస్టిస్ పులిగూర వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ ఎం. సత్య రత్న శ్రీ రామచంద్రరావు, జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పొనుగోటి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరామ చౌదరి, జస్టిస్ బులుసు శివ శంకరరావు, జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్, జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు, జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ తొడుపునూరి అమరనాథ్ గౌడ్

ఏపీ హైకోర్టుకు..  

జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ సీహెచ్. ప్రవీణ్ కుమార్, జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ దామ శేషాద్రి నాయుడు, జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్ రావు, జస్టిస్ టి. సునీల్ చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్ జి.శ్యామ్ ప్రసాద్, జస్టిస్ కుమారి జే. ఉమా దేవి, జస్టిస్ నక్కా బాలయోగి, జస్టిస్ టి. రజనీ, జస్టిస్ దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు, జస్టిస్  కొంగర విజయ లక్ష్మీ, జస్టిస్ గంగారావు

జనవరి నుంచే కార్యకలాపాలు ప్రారంభం..

జనవరి నుంచి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సేవలందిస్తుండగా, ఇటు తెలంగాణలో వున్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికి సేవలందించనుంది. ఉమ్మడి హైకోర్టులో సేవలందిస్తున్న 28 న్యాయమూర్తుల్లో 16 మంది ఏపీకి, పదిమందిని తెలంగాణకు కేటాయించారు. అయితే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీవీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్ రామసుబ్రహ్మణ్యంలను ఏ హైకోర్టుకు కేటాయించిందీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల జాబితాలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, కేరళ హైకోర్టు న్యాయమూర్తి దామా శేషాద్రి నాయుడుల పేర్లు ఉన్నాయి. అలాగే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఎంచుకున్నట్టు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, సంక్రాంతి తర్వాత కేసుల విచారణ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం దేశంలో 25వ హైకోర్టు కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amravati  Andhra Pradesh High Court  Telangana High court  Hyderabad  President  

Other Articles