Death toll from Indonesian tsunami rises to 281 సునామీ ధాటికి 281కి చేరిన మృతుల సంఖ్య

Death toll in indonesia tsunami touches 280 hundreds injured

Tsunami, indonesia tsunami, earthquake, anak krakatu, death toll, Java island, Sumatra island, indinesia

At least 280 people were killed as waves smashed into houses, hotels and other beachside buildings along Indonesia's Sunda Strait, in a disaster that followed an eruption and possible landslide on Anak Krakatau.

ఇండోనేషియాలో 281కి చేరిన మృతుల సంఖ్య

Posted: 12/24/2018 12:38 PM IST
Death toll in indonesia tsunami touches 280 hundreds injured

ఇండోనేసియాలో అకస్మాత్తుగా వచ్చిన సునామీ మృతుల సంఖ్య సోమవారం నాటికి 281కి పెరిగింది. జావా, సుమత్ర దీవుల్లో సంభవించిన సునామీ కారణంగా ఇప్పటికీ 57 మంది గల్లంతుకాగా, 1016 మంది క్షతగాత్రులయ్యారు. చడీచప్పుడు లేకుండా ఎలాంటి భూ ప్రకంపనలు లేకుండా నిషద్దంగా వచ్చిన సునామి.. ఒక్కసారిగా పంజా విసరడంతో సముద్రంలో రాకాసీ అలలు ఎగసిపడి.. అల్లకల్లోలం సృషటించిన విషయం తెలిసిందే.

క్రాకటోవా ‘శిశువు’గా పిల్చుకునే ఓ అగ్నిపర్వతం శనివారం రాత్రి 9 గంటల సమయంలో బద్దలైంది. సరిగ్గా 24 నిమిషాల తర్వాత నీటి లోపల భూమి కంపించి సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరాన్ని, జావా పశ్చిమ ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. సునామీ ధాటికి తొలుగ 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించినా.. ఆదివారానికి ఆ సంఖ్య 168కి, సోమవారానికి 281కి చేరింది. వేయి మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. సునామీ ధాటికి బీచ్‌లు క్షణాల్లో బీచ్‌లు మృత్యుదిబ్బలుగా మారాయి. వేల చెట్లను సునామీ కూకటివేళ్లతో సహా పెకిలించింది.

సరిగ్గా క్రిస్ట్మస్ ముందు వీకెండ్ కావడంలో సముద్రతీరంలోని హోట్లళ్లు, రిసార్టులు కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణలతో జావా, సుమత్రా దీపుల ప్రాంతాలు జనసంధ్రమయ్యాయి. అదే సమయంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా వచ్చిన సునామీ ధాటికి అనేక మంది భయాందోళనకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వందలాంది మంది జలసమాధి అయ్యారు. సుందా జలసంధి దారుణంగా దెబ్బతింది.

వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జావా ద్వీపంలోని పండెగ్‌లాంగ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కలపతో కూడిన చెత్త పేరుకుపోయి ఉంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కార్లు ఒకదానిపైకి ఒకటి ఎక్కి కూర్చున్నాయి. కూలిపోయిన ఇళ్లు, కలప మధ్య ఎవరైనా చిక్కుకున్నారేమో అని రెస్క్యూ టీమ్‌లు అన్వేషిస్తున్నాయి.

ఇండోనేసియాకు సునామీలు, భూకంపాలు కొత్తేమీ కాదు. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణంగా 13 దేశాల్లో రెండు లక్షల 26వేల మంది చనిపోయారు. వీరిలో కేవలం ఇండోనేసియా నుంచే ఒక లక్షా 20వేల మంది ఉండటం గమనార్హం. ఇక క్రకటోవా అగ్నిపర్వతం వల్ల సంభవించిన సునామీల కారణంగా ఇండోనేసియాలో 1883లో 36వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tsunami  indonesia tsunami  earthquake  anak krakatu  death toll  Java island  Sumatra island  indinesia  

Other Articles