Cyclone Phethai loses intensity after landfall తీరం తాకగానే ఉధృతి తగ్గిన పెథాయ్.. ఎందుకిలా..

Cyclone phethai loses intensity after landfall in katrenikona

Phethai, Cyclone ‘Phethai’, Katrenikona, machlipatnam, konaseema, kakinada, bay of bengal, east godavari, indian meteorological department, Andhra pradesh

Cyclonic storm Phethai has made a landfall at Katrenikona in Andhra Pradesh's East Godavari district, and loses its intensity on formation of another deep low pressure in indian ocean

తీరం తాకగానే ఉధృతి తగ్గిన పెథాయ్.. ఎందుకిలా..

Posted: 12/17/2018 02:51 PM IST
Cyclone phethai loses intensity after landfall in katrenikona

కోనసీమతో పాటు తీరప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసిన పెను తుపాను పెథాయ్ శాంతించింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన నేపథ్యంలో.. మరింతగా పెనుగాలులు, వర్షంతో బీభత్సం సృష్టిస్తుందని తీరప్రాంతవాసులు భయాందోళనకు గురైన క్రమంలో పెథాయ్ శాంతించింది. ప్రకృతి తన ప్రకోపాన్ని తగ్గించుకుంది. ఇప్పటికే తిత్లీ పెనుతుపాను ఏకంగా 150 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను అతలాకుతలం చేశాయి.

ఇది జరిగిన రెండు నెలల కాలంలోనే మరోమారు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పెథాయ్ విరుచుకుపడుతుందని అధికారుల సూచనలతో తీరప్రాంత వాసులు అందోళనకు గురయ్యారు. అయితే తీరానికి చేరుతున్న క్రమంలో పెథాయ్ తన ఉదృతిని మరింతగా ప్రదర్శించేందుకు బదులు బలహీనపడింది. పెను తుపాను బలహీనపడిందన్న వార్తలతో తీర ప్రాంతవాసులు ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, అమలాపురం ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

తీరాన్ని తాకిన తరువాత పెథాయ్ తూర్పు కోస్తావైపు కదలడాన్ని భారత వాతావరణ శాఖ అధికారులు గమనించారు. అయితే పెథాయ్ పెనుతుపాను తన ఉదృతిని తగ్గించినా.. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, జిల్లాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పెథాయ్ ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు తెలిపారు.

పెథాయ్ బలహీనం కావడానికి కారణమిదే..

తీరానికి చేరువుగా వచ్చిన రావడంతో తుపాన్లు మరింత ఉదృతంగా నెలపై తన ప్రభావాన్ని చాటుతాయి. ఈ క్రమంలో పెనుగాలులు వీచి ఎంతో అస్తినష్టం, ప్రాణనష్టాన్ని కూడా మిగుల్చుతాయి. అదే పెనుతుఫాను తీరం ధాటితే.. ఆ విధ్వంసం ఎంతటి విషాదాన్ని మిగుల్చుతుందో మనకు తిత్లీ, హద్దూద్ తుఫాన్లు అనభవాన్ని మిగిల్చాయి. అయితే అలాంటి పెను తుపాను పెథాయ్ బలహీనపడటంతో పెను ముప్పు తప్పింది. ఇది ఎందుకు భిన్నంగా మారింది.? కారణాలను తెలుసుకుందామా.

ఉత్తర ఆస్ట్రేలియాకు సమీపంలోని హిందూ మహాసముద్రం తీరంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండంగా మారి క్రమంగా తుపానుగా మారడంమేనని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషించారు. ఆస్ట్రేలియా తీరంలో ఏర్పడిన ‘కెన్నాంగా’ తుపాను.. ఈశాన్య ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ వైపుగా ప్రయాణించి అక్కడ తీరం దాటుతుందని అంచనా వేశారు. దీంతో అదే సమయంలో తీరం ధాటుతూ ఉదృతంగా మారే క్రమంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో.. పెథాయ్ బలహీనపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles