Cyclone Phethai makes landfall in Katrenikona తాళ్లరేవు-కాట్రేనికోన మధ్య తీరం దాటిన పెథాయ్..

Cyclone phethai makes landfall in katrenikona

Phethai, Cyclone ‘Phethai’, Katrenikona, machlipatnam, konaseema, kakinada, bay of bengal, east godavari, indian meteorological department, Andhra pradesh

Cyclonic storm Phethai has made a landfall at Katrenikona in Andhra Pradesh's East Godavari district. Heavy rains and winds are being experienced in many areas in the district.

ITEMVIDEOS: తాళ్లరేవు-కాట్రేనికోన మధ్య తీరం దాటిన పెథాయ్..

Posted: 12/17/2018 01:16 PM IST
Cyclone phethai makes landfall in katrenikona

కోనసీమతో పాటు తీరప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న పెను తుపాను పెథాయ్ తీరాన్ని తాకింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద పెను తుపాను తీరాన్ని తాకిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమలాపురానికి చేరువలో కేంద్రీకృతమైన పెథాయ్ ప్రభావంతో తీరప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. తీరాన్ని తాకిన నేపథ్యంలో ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాతో పాటుగా తీరప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి.

దీనికి తోడు కుండపోత వర్షం కూడా కురుస్తుంది. గాలుల ధాటికి ఇప్పటికే విద్యుత్ స్థంభాలు, టవర్లు కూలిపోతున్నాయి. చెట్లు నేలరాలుతున్నాయి. ఈ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా మొత్తంగా ఏడు జిల్లాలపై పెథాయ్ ప్రభావం వుంటుందని అధికారులు తెలిపారు. ఇక మరో రెండు గంటల వరకు పెథాయ్ ప్రభావంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.

మరీ ముఖ్యంగా కాకినాడపై పెథాయ్ ప్రభావం తీవ్రంగా వుంది. కాకినాడ సమీపంలోని సముద్రం అల్లకల్లోంగా మారింది. అల్లులు 8 నుంచి పదీమీటర్ల వరకు ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత గ్రామాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. సాయంత్రం వరకూ ఎవరు బయటకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. తుపాను నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమై అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా తీరప్రాంతాల్లోని గ్రామాలకు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles