modiji spare some time for your part-time job: rahul ప్రధాని జాబ్ పగ్గాలు చేపట్టండీ మోడీజీ: రాహుల్

Try presser fun to have questions thrown at you rahul gandhi to pm modi

rahul gandhi, narendra modi, narendra modi press conference, narendra modi campaigning, narendra modi rahul gandhi, telangana assembly elections 2018, telangana politics

Congress chief Rahul Gandhi took a swipe at Prime Minister Narendra Modi for not holding a press conference during his tenure, saying he should try one someday as it is fun to be asked questions.

పార్ట్ టైమ్ ప్రధాని జాబ్ పగ్గాలు చేపట్టండీ మోడీజీ: రాహుల్

Posted: 12/06/2018 04:05 PM IST
Try presser fun to have questions thrown at you rahul gandhi to pm modi

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీపై సాక్ష్యాత్తు పార్లమెంటులోనే కౌగిలించుకున్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఆయనను విమర్శించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో చివరగా తెలంగాణ, రాజస్థాన్ లకు 7వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ ఆయన ప్రధానిపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌, రాజ‌స్తాన్ లో ఎన్నిక‌ల ప్ర‌చారం అయిపోయింద‌నీ, ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగంగా ఉన్న ప్ర‌ధాని బాధ్య‌త‌ల‌ను తిరిగి చేపట్టి దేశప్రజల సమస్యలపై దృష్టి పెట్టాల‌ని చుర‌క‌లు అంటించారు.

అంతటితో అగని రాహుల్.. గత ప్రధానులకు భిన్నంగా ప్రధాని నరేంద్రమోడీ పాలన సాగుతుందని దుయ్యబట్టారు. ప్రధాని తన నాలుగున్నరేళ్ల హయాంలో ఒక్కసారి కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించలేదని.. ఆయనకు నిజంగా ద‌మ్ముంటే మీడియా స‌మావేశం నిర్వ‌హించి విలేక‌రుల ప్ర‌శ్న‌కు జ‌వాబు ఇవ్వాల‌ని స‌వాల్ విసిరారు. ఆయన మీడియా సమావేశంలో పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరు చాలా అసక్తికరంగా వుంటుందని.. హస్యాన్ని తెప్పిస్తుందని విమర్శించారు.

సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.. ‘ప్రియమైన ప్ర‌ధాన‌మంత్రి మోదీ గారికి.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ‌, రాజ‌స్తాన్ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసినందున మీ పార్ట్ టైమ్ ఉద్యోగమైన ప్ర‌ధాని బాధ్య‌త‌ల‌పై దృష్టి సారించేందుకు స‌మ‌యం కేటాయిస్తార‌ని ఆశిస్తున్నా. మీరు భార‌త ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఇప్ప‌టికే 1654 రోజులు గ‌డిచిపోయాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క మీడియా స‌మావేశం కూడా నిర్వ‌హించ‌లేదు. తెలంగాణ‌లో మ‌హాకూట‌మి ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిశాక హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఈ రోజు పాల్గొన్నా. దీన్ని మీరోసారి ప్ర‌య‌త్నించండి. మ‌న మీద ప్ర‌శ్న‌లు దూసుకురావ‌డం చాలా బాగుంటుంది’ అని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  narendra modi  part time job  press conference  bjp congress  telangana  politics  

Other Articles