lagadapati announces his pre-poll survey details ప్రజానాడి హస్తం వైపే.. స్వతంత్రులు వీళ్లే: లగడపాటి సర్వే

Lagadapati rajagopal announces his pre poll survey details

Lagadapati Rajagopal, pre-poll survey, independents, malreddy rangareddy, jalandar reddy, g.vinod, Telangana ECO, Rajath kumar, revanth reddy, Telangana government, TRS, Congress, Telangana assembly elections, Telangana elections 2018, telangana politics

Former member of parliament lagadapati rajagopal announces, another three names of independents who are in telangana assembly polls race. As per his pre-poll survey, the present swing is in favour of maha kutami.

ప్రజానాడి హస్తం వైపే.. స్వతంత్రులు వీళ్లే: లగడపాటి సర్వే

Posted: 12/04/2018 09:05 PM IST
Lagadapati rajagopal announces his pre poll survey details

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరికోన్ని గంటల వ్యవధిలో ముగుస్తున్న నేపథ్యంలో తన ప్రీఫోల్ సర్వే వివరాలను వెల్లడించారు మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్. తెలంగాణలో ప్రస్తుతం ప్రజానాడీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని వెల్లడించారు. అయితే ఇది గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం రానున్న ఎన్నికలలో నమోదయితే మాత్రమే సాధ్యమని చెప్పారు. అలా కాకుండా ఓటింగ్ శాతం పెరిగితే మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమని, ఓటింగ్ శాతం తగ్గితే రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశలుంటాయని అన్నారు.

ఇక విభజన తర్వాత ప్రజల మధ్య ఎలాంటి రాగద్వేషాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంతో మెలుగుతున్నారని అన్నారు. ఇక జిల్లాల వారీగా పార్టీల బలాబలాలను కూడా ఆయన తెలిపారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఆధిక్యత లభిస్తుందని, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని లగడపాటి అభిప్రాయపడ్డారు.

ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో ఎంఐఎంకు, ఆ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు గెలుస్తాయని లగడపాటి తన సర్వేలో పాక్షిక వివరాలను వెల్లడించారు. ఇదిలా వుండగా, ఈ ఎన్నికలలో స్వతంత్రులుగా బరిలో దిగిన రెబెల్స్ గెలుస్తారని వారిలో నారాయణ్ పేట్ నుంచి శివకుమార్ రెడ్డి, భోద్ నుంచి అనీల్ జాదవ్ పేర్లను ఇప్పటికే ప్రకటించిన ఆయన ఇక తాజాగా ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్సీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి గెలుపోందే అవకాశాలున్నాయిని అన్నారు.

ఇక మహాబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నుంచి జలందర్ రెడ్డి.. అదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుపోందుతారని చెప్పారు. ఇక మరో మూడు స్థానాల్లో కూడా స్వతంత్రులు గెలుపొందనున్నారని, అయితే ఆ స్థానాల వివరాలు తెలపడానికి.. ఆయా స్థానాల నుంచి బరిలోవున్న తన స్నేహితులు అడ్డుపడుతున్నారని అన్నారు. అయితే బుధవారం సాయంత్రం వరకు సమయం వున్నందున ఈ లోపు మిగతా ముగ్గురి వివరాలను తెలియజేస్తానని తెలిపారు.

ఇక రాష్ట్రంలో బీజేపి జిల్లాలకు కూడా విస్తరిస్తుందని చెప్పిన ఆయన గతం కంటే ఈ సారి వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను వంద నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు, ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1200 నమూనాలు తీసుకున్నామని, అన్ని సామాజిక వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించామని చెప్పారు.  ప్రస్తుతం తనకు ఏ పార్టీతోనూ, ఎవరితోనూ సంబంధం లేదని, 2009, 2014 ఎన్నికల్లో తాను చెప్పింది నిజమైందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lagadapati Rajagopal  pre-poll survey  independents  Mahakutami  telangana  politics  

Other Articles