KTR slams Lagadapati on his pre-poll survey లగడపాటిపై కేటీఆర్ ఫైర్.. రాజకీయ ఉగ్రవాదని వ్యాఖ్య

Ktr slams lagadapati rajagopal on his pre poll survey

Telangana elections 2018, lagadapati pre-poll survey, lagadapati-KTR pre poll controversy, Pre-poll survey, Rahul Gandhi, Congress, KCR, Chandrababu, kodandaram, KTR, lagadapati rajagopal, maha kutami, seat sharing, pre-poll survey, Telangana, Politics

KTR slams former MP Lagadapati Rajagopal, alleges that he wanted to confuse people of telangana with his pre-poll survey, which is manipulated with pressure of chandrababu.

లగడపాటిపై కేటీఆర్ ఫైర్.. ఒత్తిడితో సర్వేను మార్చారని అరోపణ

Posted: 12/05/2018 11:27 AM IST
Ktr slams lagadapati rajagopal on his pre poll survey

మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వే ఫలితాలు చిలక జోస్యాన్ని తలపిస్తున్నాయి తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రచారం చివర్లో సర్వేల పేరుతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రజాకూటమి పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కలిసి కుట్ర చేసి అసలు ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. వీరిద్దరూ పొలిటికల్ టూరిస్టులే అని విరుచుకుపడ్డారు. డిసెంబర్ 11న ఫలితాల రోజున ఇద్దరూ తట్టా బుట్ట సర్దేస్తారని.. వెయిట్ అండ్ వాచ్ అని అన్నారు కేటీఆర్.

లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలను తప్పుపట్టడానికి కారణాలను కూడా వివరించారు కేటీఆర్. తనకు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నవంబర్ 20వ తేదీన లగడపాటి ఓ సర్వే రిపోర్టును పంపించారని చెప్పారు కేటీఆర్. అందులో టీఆర్ఎస్ విజయం స్పష్టంగా కనిపించింది అంటూ… లగడపాటితో చేసిన వాట్సప్ చాట్ వివరాల స్క్రీన్ షాట్ ను.. కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. టీఆర్ఎస్ కు 65 నుంచి 70 సీట్లు వస్తాయని లగడపాటి సర్వే వివరాలను తనకు పంపించినట్టు చెప్పారు.

చంద్రబాబు చేసిన ఒత్తిడితో అదే సర్వే రిపోర్టులో అంకెలు మార్చి లగడపాటి తప్పుగా ప్రకటించారని అన్నారు. చివరి రెండు వారాలుగా టీఆర్ఎస్ పలు అంశాలను బాగా డీల్ చేసిందని అందుకే పరిస్థితి మెరుగయ్యిందని లగడపాటి కేటీఆర్ కు చెప్పారు. నవంబర్ 20న సర్వే వివరాలను పంపిన లగడపాటికి…. 70 మార్క్ దాటి చూపించి సర్ ప్రైజ్ చేస్తామని కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూశామని.. టీఆర్ఎస్ ఎన్నికల మేనేజ్ మెంట్ స్కిల్స్ ఎలా ఉంటాయో తనకు తెలుసని లగడపాటి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  lagadapati rajagopal  maha kutami  seat sharing  pre-poll survey  Telangana  Politics  

Other Articles