Revanth Reddy arrested in Kodangal అర్థరాత్రి హైడ్రామా మధ్య రేవంత్ రెడ్డీ అరెస్ట్

Congress firebrand leader revanth reddy arrested in kodangal

revanth reddy, P Narender Reddy, kcr, geetha, kondal reddy, TRS, Congress, Telangana PCC, Telangana PCC working President arrested, KCR rally, Harish Rao, Rajat Kumar, CEO, Telangana assembly elections, Telangana elections 2018, telangana politics

Telangana Congress Working President Revanth Reddy was arrested in an early morning swoop on his residence in Kodangal of Vikarabad district ahead of caretaker CM KCR’s election rally in the town.

ITEMVIDEOS: అర్థరాత్రి హైడ్రామా మధ్య రేవంత్ రెడ్డి అరెస్ట్

Posted: 12/04/2018 10:28 AM IST
Congress firebrand leader revanth reddy arrested in kodangal

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అర్థరాత్రి హైడ్రామా మధ్య పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల కింద అరెస్టు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో మంగళవారు వేకువ జామున మూడు గంటల సమయంలో ఆయన ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఇళ్లలో తనిఖీలు పేరుతో వేధిస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ సభను కూడా అడ్డుకునే అవకాశాలు వున్నాయని భావించిన పోలీసులు ఇప్పటికే కొడంగల్ లో 144 సెక్షన్ ను విధించారు. అయితే ఇది అందరికీ వర్తిస్తుందా.? లేక రేవంత్ రెడ్డి ఆయన అనుచరులకు మాత్రమే వర్తిస్తుందా.? అన్న ప్రశ్నలు తలెత్తేవిధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వున్నాయి. 144 సెక్షన్ అమల్లో వుంటే మంత్రి హరీష్ రావు కోస్గీలో ఎలా అనుచరగణంతో వున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

కేసీఆర్ ప్రచారాన్ని అడ్డుకోవాలని, కాంగ్రెస్ అభిమానులంతా బంద్ లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అతని ఇంట్లోకి వెళ్లారు. అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరులు, వాచ్‌మెన్‌, గన్‌మెన్లను అరెస్ట్ చేశారు. అనంతరం పరిగి వద్ద వాచ్ మెన్ ను వదిలివెళ్లారు.

ఉగ్రవాదిని లాక్కెళ్లినట్లు నా భర్తను లాక్కెళ్లారు: గీత

పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత తీవ్రంగా మండిపడ్డారు. తన భర్తను ఉగ్రవాదిని లాక్కెళ్లినట్లుగా బలవంతంగా తీసుకెళ్లారని అమె అరోపించారు. కొడంగల్ లో 144 సెక్షన్ అమల్లో వుంటే కేసీఆర్ సభకు ఎలా అనుమతి ఇచ్చారని అమె ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావు గత రెండు రోజులుగా ఇక్కడే మందీ మార్భలంతో ఎలా తిష్టవేశారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ సభకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తాను కూడా సభకు వెళ్తానని అమె పోలీసులను కోరారు. తన భర్త ఎదుగుదల జీర్ణంచుకోలేని అధికార పార్టీ.. ఆయనను ఓడించేందుకు దోడ్డిదారిన కుట్రలు, కుతంత్రాలను పన్నుతుందని అమె అరోపించారు.

అధికార పార్టీ కుటిల యత్నాలకు పోలీసులు కూడా మద్దతు పలుకుతున్నారని అమె అరోపించారు. తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ఓటమి భయంతో కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని రేవంత్ భార్య విఙ్ఞ‌ప్తి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అధికార పార్టీపై తమ ఓటుతోనే బుద్ది చెప్పాలని అమె పిలుపునిచ్చారు. రేవంత్‌ అరెస్ట్‌ నేపథ్యంలో అతని ఇంటివద్దకు చేరకున్న అనుచరులను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. రేవంత్ నివాసం వద్ద 100 మందికి పైగా పోలీసులను మోహరించారు. మరోవైపు బొంరాస్‌పేట మండలంలోనూ 9 మంది క్రీయాశీలక కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  Telangana PCC  KCR public meetins  CM KCR  Harish Rao  KCR rally  Harish Rao  telangana  politics  

Other Articles