TRS Workers Allege Money Distribution By TDP Men టీడీపీ డబ్బులు పంచుతుందని టీఆర్ఎస్ ఆందోళన

Tension grips ameerpet trs workers allege money distribution by tdp men

tension in ameerpet, trs alleges tdp activists distributing money, tdp workers, money distribution, Sanath Nagar constituency, Ameerpet, TRS workers, congress,, telangana, telangana assembly elections 2018, telangana politics

Hours after Tension prevailed in khammam Madhira constituency, Now the same gripped Ameerpet under Sanath Nagar constituency after TRS workers staged a protest alleging distribution of money in the area by TDP workers.

అమీర్ పేట లో టెన్షన్.. టీడీపీ డబ్బులు పంచుతుందని టీఆర్ఎస్ ఆందోళన

Posted: 12/03/2018 02:19 PM IST
Tension grips ameerpet trs workers allege money distribution by tdp men

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అధికార టీడీపీ, ప్రజాకూటమి పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ తరుణంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తమ వంతుగా అందివచ్చిన అన్ని ప్రయత్నాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా డబ్బుతో కూడా ఓట్లర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బు పంచుతున్నారని కాంగ్రెస్ నేతలు పోలిస్ స్టేషన్ ను అశ్రయించిన విషయం తెలిపిందే.

ఓటర్లకు సంబంధించిన ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ల నెంబర్లు తీసుకుని నేరుగా వారి ఖాతాలో డబ్బు జమచేయడానికి యత్నిస్తున్నారని అనుమానితులను అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. అయితే వారిని పోలీసులు వదిలేయడంతో స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క పోలిస్ స్టేషన్ లోకి వెళ్లి నిరసనకు దిగడం.. సమాచారం అందుకున్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పోలిస్ స్టేషన్ కు చేరకుని భట్టికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తతం చోటుచేసుకుంది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. అయితే పోలీసులు అధికార పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని భట్టి అరోపించారు. ఇదిలావుండగా, అదే సమయంలో ఇటు హైదరాబాద్ నగరంలోని అమీర్ పేటలో కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నలుగురు టీడీపీ పార్టీ కార్యకర్తలు డబ్బు పంచుతున్నారని టీఆర్ఎస్ కార్యకర్తలు అరోపిస్తూ.. వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలు బస చేసిన హోటల్ పై దాడి చేసి.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనుమానితుల నుంచి రూ.4.74 లక్షలు, కారు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ సనత్ నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులు ఆరోపించారు. కాగా టీఆర్ఎస్ కార్యకర్తలు తమపై దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. అటు ఖమ్మంలో డబ్బు పంచుతూ పట్టుబడిన టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించి.. డబ్బు పంచితే ఎన్నికల సంఘం అధికారులకు పిర్యాదు చేయాలని నినదించారు. అయితే అమీర్ పేటలో మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డబ్బు పంచుతున్నారన్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడమేంటని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇదిలావుంటే, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్‌ప్రసాద్‌ కుమారుడు శివకుమార్ కారులో 70 లక్షల రూపాయలను తరలిస్తున్నట్లు సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆకస్మికంగా దాడి చేసిన పోలీసులు ఆయన కారు నుంచి డబ్బును సీజ్‌ చేశారు. భవ్య సిమెంట్స్‌ డైరెక్టర్‌ శివకుమార్‌, కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles