Set back to Nagam Janardhan Reddy in HC నాగం జనార్థన్ రెడ్డీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

Set back to congress leader nagam janardhan reddy in high court

nagam janardhan reddy, high court, palamuru-ranagareddy project, BJP, telangana, telangana assembly elections 2018, telangana politics

Set back to congress leader Nagam Janardhan Reddy in Hyderabad High Court, as the apex court stikes off the petition filed by him.

నాగం జనార్థన్ రెడ్డీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

Posted: 12/03/2018 12:59 PM IST
Set back to congress leader nagam janardhan reddy in high court

తెలంగాణ కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపి పార్టీ నేతగా గతంలో వ్యవహరించిన ఆయన అప్పట్లో పాలమూరు రంగారెడ్డి  ప్రాజెక్టుకు సంబంధించిన అనేక పనులను క్షణ్ణంగా పరిశీలించి అవకతవకలు ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయని నమోదు చేశారు. ఆ సమయంలోనే ఆయన ఈ అవకతవకలపై న్యాయపోరాటం చేయాలని కూడా నిర్ణయించారు. హైకోర్టును ఆశ్రయించి ప్రాజెక్టు పనుల నేపథ్యంలో జరుగుతున్న అక్రమాలపై పలు పిటీషన్లను కూడా వేశారు.

అయితే ఈ పిటీషన్లపై తాజాగా విచారణకు స్వీకరించిన ఇరు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు షాక్ ఇచ్చింది. బీజేపి నుంచి కాంగ్రెస్ లోకి ఈ నేత చేరిన తరువాత కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఆయన పిటిషన్ ను ధాఖలు చేశారు. కాగా ఇరు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం నాగం పిటీషన్ ను కొట్టి వేసింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ... ఎత్తిపోతల పథకంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపింది. ప్రాజెక్టులో అక్రమాలు జరగలేదని, పర్యావరణ శాఖ కూడా ప్రాజెక్టుకు అనుమతులను జారీ చేసిందని వెల్లడించింది. గత రెండు, మూడు వారాలుగా ఈ పిటిషన్ పై వాదనలు జరిగ్గా.. ఇవాళ ఈ పీటిషన్ పై హైకోర్టు తన తుది తీర్పును వెలురించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles