TRs to bag 70 seats: Times Now survey టీఆర్ఎస్ కే మళ్లీ అధికారం: టౌమ్స్ నౌ సర్వే

Trs party to win power again in telangana times now survey

telangana elections 2018, Telangana assembly elections, Times Now-CNX pre-poll survey, Opinion Poll, Exit poll, Pre-poll survey, K Chandrashekhar Rao. TRS. TDP, Chandrababu naidu, Uttam Kumar Reddy, Congress, Maha kutami, Kodandaram, Telangana Politics

The Times Now-CNX pre-poll survey shows the K Chandrasekhar Rao-led TRS is expected to win 70 seats out of the total 119 that are there in the Telangana Legislative Assembly.

టీఆర్ఎస్ కే మళ్లీ అధికారం: టౌమ్స్ నౌ సర్వే

Posted: 11/30/2018 11:44 AM IST
Trs party to win power again in telangana times now survey

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు అధికార టీఆర్ఎస్ దాని మిత్రపక్షమైన ఏంఐఎం పార్టీలు కలసి ప్రచారం చేసుకుంటూ దుసుకుపోతుండగా, మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలోని పార్టీలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని రాజకీయ వేడి రాజుకుంది. ఏ పార్టీ ఈ సారి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుంది అన్న ప్రశ్నలు స్నేహితుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.

ఈ క్రమంలో టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ సర్వే ప్రీపోల్ సర్వే విడుదల చేసింది. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల ఫలితాలు నాలుగు రోజులు ఆలస్యంగా డిసెంబర్ 11న వెలువడనున్న తరుణంలో తెలంగాణలో మరోమారు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఫ్రభుత్వమే పాలనా పగ్గాలను అందుకోనుందని సర్వే తేల్చింది. అయితే ఈ సర్వేలో శాస్త్రీయపరమైన విషయాలను వెలువరించకుండా టీఆర్ఎస్ పార్టీ మరోమారు అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని మాత్రం వెలువరించింది.

ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి సుమారు 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఘంటాపథంగా చెబుతుంది. 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణ శాసనసభలో 31 స్థానాలను గెలుచుకుని మరోమారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించనుందని తెలిపింది. ఇక టీడీపీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కానుందిని స్పష్టం చేసింది. ఎంఐఎం పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకుంటుందని, కాగా, బీజేపి మూడు సీట్లను మాత్రమే సాధిస్తుందని టైమ్స్ నౌ సీఎన్ఎక్స్ సంస్థ సంయుక్తంగా చేసిన సర్వే స్పష్టం చేసింది.

కాగా, ఈ సారి ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీ తన ఓటు శాతాన్ని మెరుగుపర్చుకుంటుందని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. గతంలో 34.3 శాతం వున్న ఓటు షేరును ఈ సారి ఎన్నికలలో 37.55 శాతానికి పెంచుకుంటుందని చెప్పింది. అయితే సుమారు 50 శాతం ప్రజల ఓట్ల శాతం అధికార పార్టీ పక్షానే నిలుస్తుందని టైమ్స్ నౌ వెల్లడించింది. కాగా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎలాంటి ప్రీ పోల్ సర్వేలు వెల్లడించరాదని అదేశాలను ఎన్నికల సంఘం జారీ చేసినా.. ఈ సంస్థలు ఎలా వీటిని వెల్లడిస్తున్నాయన్నది అర్థకాని ప్రశ్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Times Now-CNX  pre-poll survey  KCR. TRS  MahaKutami  Telangana Politics  

Other Articles