Former mla kaveti sammaiah resigns TRS టీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ

Another jolt to trs former mla kaveti sammaiah resigns to party

kaveti samaiah, kaveti samayya, khaghaznagar, konappa, KCR, CM, TRS, Congress, Praja Front, Praja Kutami, Telangana, politics

Another jolt to ruling TRS party on the next day of CM KCR visit to Khaghaznagar, former MLA kaveti sammaiah resigns to party, to join congress soon.

ఎన్నికలకు వారం ముందు టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ

Posted: 11/29/2018 08:59 PM IST
Another jolt to trs former mla kaveti sammaiah resigns to party

తెలంగాణలో ఎన్నికల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మరో జలక్ తగిలింది. ఎన్నికల వేడి జోరందుకున్న ఈ తరుణంలో అన్ని పార్టీల అధినేతలు మత పార్టీల అభ్యర్థు గెలుపుకోసం రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా మరో ఆరు రోజు రోజులు మాత్రమే ప్రచారం వుండగా, అధికార పార్టీకి షాక్ తగిలింది. అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన రోజే కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో తెరాసకు ఎదురు దెబ్బ తగిలింది.

సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల కాలంలో పార్టీలో తనకు సరైన గుర్తింపును ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ కాగజ్ నగర్ లో పర్యటించినప్పటికీ తనకు సమాచారం లేదన్నారు. పార్టీలో తనకు గౌరవం లేకపోవడమే కాకుండా తనను అవమానించాలనే పార్టీ కార్యక్రమాలకు కూడా తమను పిలవడం లేదని అవేదన వ్యక్తం చేసిన ఆయన దీంతోనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

ఉద్యమ జెండాను మోసి.. అది నుంచి పార్టీలో కొనసాగిన తనను పక్కనబెట్టిన.. ఆంధ్ర నాయకులను చేరదీస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కోనప్పని ఆంధ్రా అప్ప అని గతంలో విమర్శించిన అపధ్మర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఆయనకే ప్రాధాన్యమివ్వడం బాధించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ జెండా మోసిన తనలాంటి వాళ్లను అవమానపర్చారంటూ సమ్మయ్య ధ్వజమెత్తారు. రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. సమ్మయ్య త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaveti samaiah  kaveti samayya  khaghaznagar  konappa  KCR  CM  TRS  Congress  Praja Front  Praja Kutami  Telangana  politics  

Other Articles