pawan questions on delay in passing women reservation bill రాజకీయాల్లోకి మహిళలు రాకపోతే.. భ్రష్టుపట్టిపోతాయి

Pawan kalyan emotional speech on dwacra women konaseema pollution

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, gangavaram, pawan kalyan porata yatra, pawan kalyan meet with dwacra sangh women, pawan kalyan east godavari yatra, Pawan Kalyan kostandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan questions what is delay behind passing women reservation bill which is pending in parliament for decades.

ITEMVIDEOS: మహిళా రిజర్వేషన్ బిల్లుపై గళమెత్తిన పవన్ కల్యాణ్..

Posted: 11/29/2018 03:45 PM IST
Pawan kalyan emotional speech on dwacra women konaseema pollution

ఒక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగినపుడు, రామ మందిరం కోసం ఉద్యమాలు జరిగినపుడు, జన్మనిచ్చిన తల్లుల రిజర్వేషన్ కోసం ఎందుకు పోరాటం చేయరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో పాసు కావడానికి ఇంకా ఎన్నేళ్ల పాటు ప్రసవ వేధను అనుభవించాలని ఆయన నిలదీశారు. అమలాపురంలో జరిగిన డ్వాక్రా మహిళల మీటింగ్ లో ప్రశ్నించారు. విలువలు, బాధ్యతతో కూడిన ఆడపడుచులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆయన పిలుపునిచ్చారు.

నిజాయితీ కలిగిన మహిళలు రాజకీయాల్లోకి రాకపోతే సమాజంలో అవినీతి, అన్యాయం, అక్రమాలు, అలజడులు పెరిగిపోతాయని ఆయన అందోళన వ్యక్తం చేశారు. అయితే అడపడచులు రాజకీయాల్లో రాకపోతే.. చంద్రబాబు, జగన్, లోకేష్ వంటివాళ్లు పెరిగిపోయి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తారని హెచ్చరించారు. అందుకే మహిళలకు నిత్యం అండగా నిలిచే జనసేన.. వారి అభ్యున్నతి కోసం 33 శాతం రిజర్వేషన్ కోసం జనసేన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.

జన్మనిచ్చే ఆడవాళ్లు సాక్షాత్తు దైవసమానులు, అలాంటి ఆడపడుచులకు సరైన గౌరవం ఇవ్వకపోతే సమాజం విచ్చిన్నం అయిపోతుందని పేర్కోన్నారు. బూతులు తిట్టేవారు, నోరేసుకుని పడిపోయేవారు మహిళా నాయకులు కాదు, విలువలు మాట్లాడేవారు, సమస్యలు అర్థం చేసుకునేవాళ్లు, మానవత్వంతో వ్యవహరించేవారు అర్థులను అమ్మలా అదరించే వాళ్లే నిజమైన మహిళా నాయకులు అని వ్యాఖ్యానించారు. మగవాళ్ల ఆధిపత్యంలో రాజకీయాలు అవినీతిమయం అయిపోయాయని అన్నారు. జనసేన పార్టీ తరపున విలువలు, బాధ్యతతో కూడిన ఆడపడుచులను రాజకీయాలలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా పవన్ అన్నారు.

ఇక మరో సందర్బంలో.. పచ్చటి కోనసీమ కాలుష్యకాసారంగా మారడంపై ఆయన మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో ఆయిల్ కంపెనీలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. ప్రకృతి అందాలకు కేరాఫ్ గా మారిన కోనసీమను.. బీడు భూమిగా మార్చేశారని విమర్శించారు. ఇక్కడ చోటుచేసుకున్న అవినీతికి గ్యాస్ ప్రమాదాలే ప్రత్యక్ష సాక్ష్యమని వ్యాఖ్యానించింది. అధికారుల అవినీతి, ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యానికి వందలాది మంది కోనసీమ ప్రజలు ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయారని విమర్శించింది. ఈ ఘటనకు సంబంధించిన శతాఘ్ని మిస్సైల్ పేరున ఓ వీడియోను జనసేన పార్టీకి విడుదల చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles